Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IIT Hyderabad: అద్భుత ఆవిష్కరణలు

–త్రీడీ టెక్నాలజీతో దేహంలోని రక్తనాళాల గుర్తింపు
–పొలంలో టొమాటోలు కోసే రోబో
–సైనికుల రక్షణ కోసం ఫైర్‌ సేఫ్టీ సూట్‌
–సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ ఐఐటీ

IIT Hyderabad:ప్రజా దీవెన, హైదరాబాద్: ఆపత్కా లంలో ఆదుకునేందుకు అద్బుత ఆవిష్కరణలు అందుబాటులో విస్కృతమయ్యాయి. గర్భా శయ ముఖ ద్వార క్యాన్సర్‌ పరీక్ష (Cancer test)ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే రక్త నమూనా తీసు కునేటప్పుడు కొంతమందికి రక్త నాళం దొరక్క చాలా ఇబ్బంది అవు తుంది. అలాంటి సందర్భాల్లో రక్త నాళం ఎక్కడుందో చూపించే పరి కరం అందుబాటులో ఉంటే అద్భు తమైన ఆ పరికరాలు ఎక్కడో ఊహల్లోకాదు సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైద రాబాద్‌లో సోమవారం ఆవిష్కృ తం అయ్యాయి. దేశంలో ని విద్యా సంస్థలు, పరిశ్రమల అను సంధా నంతో ఐఐటీహెచ్‌లో జరిగిన ‘ఇన్నో వేషన్‌ డే ఫెయిర్‌’ (Innovation Day Fair) ఈ సరికొత్త ఆవి ష్కరణలకు వేదికగా నిలిచిం ది. ఈ ఉత్సవాన్ని ఐఐటీహెచ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీవీ ఆర్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులోని బయోమెడికల్‌ ఇంజ నీరింగ్‌ విభాగం పరిశోధకులు ‘సీ– కాలర్‌ డిటెక్షన్‌’ పేరుతో సర్వీసెల్ఫ్‌ కిట్‌ను తయారుచేశారు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షను (Cancer test)మ హిళలు ఈ కిట్‌ సాయంతో ఇంటి వద్దే చేసుకోవచ్చు. అలాగే ఐఐటీ హెచ్‌లోని భౌతికశాస్త్ర విభాగం పరిశోధకులు ఇన్‌ఫ్రారెడ్‌, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి. స్కానిం గ్‌తో (scanning) నరాలను కనిపెట్టే టెక్నాలజీ అభివృద్ధి చేశారు. ‘త్రీడీ వెయిన్‌ వ్యూయర్‌’గా పిలిచే ఈ పరికరంతో ఒక్కసారి మన శరీరంపై స్కాన్‌ చేస్తే ఒంట్లోని రక్తనాళాలు స్పష్టంగా కన పడతాయి. ఇది డాక్టర్లు, నర్స్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు (Doctors, Nurses, Lab Technicians) ఎంతో ఉప యోగకరంగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది పేషెంట్లకు త్వరగా ఇంజెక్షన్లు చేయడానికి, రక్త పరీక్షలు తొందరగా నిర్వహించడానికి వీలుగా ఉంటుంది.

భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఉపయోగించి రోబోలతో (robo)కూడా ఇంజెక్షన్‌లు, రక్త పరీక్షలు చేయించవచ్చు. ఇక.. ఐఐటీహెచ్‌ ఇంక్యుబేషన్‌ స్టార్టప్‌ పరిశోధకులు ఇండియన్‌ నేవీతో కలిసి ట్రాడీ గ్రేడ్‌ ఫైర్‌ రెసిస్టెంట్‌ (Trady grade fire resistant) సూట్‌ను తయారు చేశారు. 2.3 కేజీల బరుగల ఈ సూట్‌ 1200 డిగ్రీల వరకూ వేడిని తట్టుకుం టుం ది. ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకున్నా ఈ సూట్‌ వేసుకున్న వారి ప్రాణాలకు హాని జరగదు. అగ్ని ప్రమాదాలు జరిగి మంటల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకురావడానికి అగ్నిమాపక దళాలకు ఈ సూట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఐఐటీహెచ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన పరిశోధకులు కూరగాయల రైతులకు ఖర్చు తగ్గించేందుకు అగ్రీబాట్‌ పేరుతో టొమాటో పంటను సంరక్షించి, టొమాటోలను కోసే యంత్రాన్ని రూపొందించారు. ఇవి కాక ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసె సింగ్‌, వాతావరణ మార్పు, ఈ– మొబిలిటీ, క్లీన్‌ఎనర్జీ, స్థిరమైన సాంకేతికతలు, రక్షణకు సంబం ధించి 35 రకాల ఆవిష్కరణలను ఈ వేడుకలో ప్రదర్శించారు.