Independence Day Celebration: ప్రజా దీవెన, హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో (Independence Day Celebration) భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma)రాజ్ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ విముక్తి కోసం పోరాడిన అసంఖ్యాక దేశభ క్తుల త్యాగాలను కొనియాడారు. అలాగే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ ప్రయాణాన్ని ప్రస్తా వించారు. ప్రతి భారతీయుడు దేశం (Indian is a nation)పట్ల గర్వంగా భావించాలని, దేశం, తెలంగాణ రాష్ట్రం రెండూ వేగంగా అభివృద్ధి చెందడానికి అవిశ్రాంతం గా కృషి చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు సందే శం ఇచ్చారు. కాగా తెలంగాణ గవర్నర్ హోదాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొట్టమొదటి సారి జాతీయ జెండాను ఎగురవేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.