Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International terrorist organization: హైదరాబాద్ లో మరోసారి ఉగ్రమూకల ఆనవాళ్లు

–అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ కు షెల్టర్
–ఆరు నెలలు సికింద్రాబాద్ లో రిజ్వాన్ ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు

International terrorist organization: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఎక్క ఉగ్రవాద దాడులు (Terrorist attacks)జరిగినా దాని మూలాలు హైద రాబాద్ తో ముడిపడి ఉంటు న్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడ్డా యి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (International terrorist organization) ఐసిస్ (ics) కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ స్పేషల్ సెల్ పోలీసులు ఫరిదాబాద్ సరిహద్దులో ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అనుమతితో కస్టడిలోకి తీసుకున్న పోలీసులకు విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రిజ్వాన్ అలీ (Rizwan Ali)యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడంలో దిట్ట. సుమారు ఏడాది కాలంగా పరారీలో ఉన్న ఇతడిపై ఎన్ఐఏ రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. రిజ్వాన్ కేరళతో (Rizwan with Kerala) పాటు హైదరాబాద్ లోనూ తలదాచుకున్నట్లు విచారణలో తేలింది. నగరానికి చెందిన ఘోరీతో రిజ్వాన్ నిత్యం సంప్రదింపులు జరిపినట్లు తేటతెల్లమైంది. రాష్ట్ర నిఘా విభాగానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.