Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET exam Leakage: నీట్ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు

నీట్ ఎగ్జామ్ లో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిం చారు.

విద్యార్థుల జీవితాలను ప్రభావి తం చేసే నీట్ ఎగ్జామ్ అక్రమాలు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

ప్రజా దీవెన, హైదరాబాద్: నీట్ ఎగ్జామ్ లో(NEET Exam)అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా స్పందిం చారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపిం చాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవి ష్యత్ కు సంబంధించిన కీలక మైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెం టనే స్పందించాలని డిమాండ్ చేశా రు. లక్షలాది మంది వైద్య విద్యా ర్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చి తంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ అవక తవకలు ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కు లతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనితో తోడు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్ లో 4-1 మార్కిం గ్ విధానం(Marking Procedure) ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమన్న ది సాధ్యమయ్యే పనికాదన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ‘గ్రేస్ మార్కు లు’ ఇచ్చామని చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు(Grace marks)ఇచ్చిన ట్లు తెలుస్తోంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించా రన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

నీట్ ఫలితా లను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయ టం కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే(NDA) సర్కార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. అయితే నీట్ ఎగ్జా మ్ విషయంలో బీఆర్ఎస్(BRS) తరపున పలు పశ్నలతో పాటు కొన్ని డిమాం డ్లను కేటీఆర్ కేంద్రం ముందుంచా రు. గత 5 ఏళ్లలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థి కూడా నీట్ లో టాప్ 5 ర్యాకింగ్లో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అక్ర మాలే కారణమని మేము నమ్ము తున్నాం. గ్రేస్ మార్కుల కేటాయిం పు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తు న్నాం.

ఒక ప్రామాణిక పద్దతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుంది. కానీ 1500 మంది విద్యార్థుల గ్రూప్కు మాత్రమే మేలు చేసే విధంగా గ్రేస్ మార్కులు కలి పారు. అది సరైన విధానం కాదు. ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్పర్ట్ కమిటీతో(High Level Expert Committee)విచారణ జరి పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయ ట పెట్టి అన్యాయం జరిగిన విద్యా ర్థులకు వారి కుటుంబాలకు న్యా యం చేయాలి. అక్రమాలకు పాల్ప డిన వారిని కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Investigation on NEET irregularities