–అధికారికంగా జెండర్ మార్చుకు న్న సివిల్ సర్వీసెస్ అధికారి
–అనసూయ కాదు ఇకపై అనుక తికర్ సూర్యా
IRS Officer: ప్రజా దీవెన, హైదరాబాద్: జీవితం లో తాను కోరుకున్న కోరికలు తానే తీర్చుకుంది ఓ ఐఆర్ఎస్ (IRS Officer) అధికారి. ఏకంగా జెండర్ మార్చుకొని సంచ లనం సృష్టించింది. అధికారికంగా తన పేరు జెండర్ మార్చాలంటూ ఐఆర్ఎస్ ఆఫీసర్ (IRS Officer) అనసూయ కేంద్ర ప్రభుత్వానికి (Central Govt) అప్పీలు చేసు కోగా ఆ మేరకు కేంద్రం ఆమోదిం చింది. తన పేరును అనుకతిర్ సూర్యగా మార్చుతూ తనను పురుషుడిగా గుర్తించాలని దర ఖాస్తు చేసుకున్నారు. సివిల్ సర్వీ సెస్ (Civil Service Cess) చరిత్రలో అధికారికంగా జెండర్ మార్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అనుకతిర్ హైదరాబాద్ లో సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో జాయింట్ కమిషనర్ గా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా జెండర్ ఐడెంటిటీ వ్యక్తిగతం అని గతంలోనే ప్రకటించి oది కేంద్ర ప్రభుత్వం (Central Govt). ఇదిలా ఉండ గా అనుసూయన కొత్త చరి త్రకు నాంధి పలికారు. జాయింట్ కమిష నర్‌గా పని చేస్తున్నా 35ఏళ్ల అన సూయ తన పేరును, తన జెండర్ ను మార్చేసుకున్నారు. దీనికి భార త ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడంతో తన పేరును ఎం అను కతిర్ సూర్యగా మార్చుకున్నారు. ఇకపై అమ్మాయిని కాదని అబ్బా యినంటూ ప్రకటించారు. అధికారిక ఉత్తర్వులు ప్రకారం “అనుసూయ అభ్యర్థన పరిగణనలోకి తీసుకు న్నాం. ఇక నుంచి అన్ని అధికారిక రికార్డుల్లో అనుకతిర్ సూర్య’గా (Anukathir Surya) గుర్తిస్తున్నాం.” అని ఉంది.
సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో (chennai) అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగంలో చేరారు. అక్కడే 2018లో డిప్యూటీ కమిషనర్‌గా (Deputy Commission) ప్రమోషన్ వచ్చింది. తర్వాత 2023లో హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సూర్య చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి గతేడాది సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో (Cyber Forensics) పీజీ డిప్లొమా డిగ్రీ పొందారు. జెండర్ గుర్తింపు అనేది వ్యక్తిగత విషయమని నల్సా కేసులో సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం స్పష్టం చేసింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఐఆర్‌ఎస్ కేసుతో మరోసారి ఆ కేసు వివరాలు అంతా గుర్తు చేసుకుంటున్నారు.