–రోజువారిగాచేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు
JAGAN:ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (JAGAN) అక్రమాస్తుల వ్యవ హారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై (On discharge petitions)రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది. గత విచారణ సందర్భంగా ఈ నెల3న జారీచేసిన ఆదేశాలనే పునరుద్ఘాటించింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలనే సుప్రీంకోర్టు (Supreme Court)ఆదేశాలమేరకు హైకోర్టు ప్రత్యేకంగా ఆ కేసుల విచారణను పర్యవేక్షిస్తోం ది.
దీంతోపాటు జగన్ (jagan) కేసుల్లో వేగవంతంగా విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో (Justice Alok Aradhe, Justice T. Vinod Kumar)కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిగుర్తింపు పొందిన కోర్టుల్లో విచారణలో ఎంతో కొంత పురోగతి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు విషయానికొస్తే జగన్‌పై ఉన్న కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశించామ ని, ఆయా కేసుల్లో మరోసారి పురోగతి తెలియజేయాలని రిజిస్ట్రీ ని, సీబీఐ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.