–టీపీసీసీ నాయకులు బట్టు జగన్ యాదవ్
Jagan Yadav: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ లో భారీ వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రతిపక్ష నాయకులు వరదలొ కూడా బురద రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ నాయకులు బట్టు జగన్ యాదవ్ (Jagan Yadav)ధ్వజమె త్తారు.గడిచిన పదేళ్లలో ముఖ్య మంత్రిగా పని చేసిన కేసీఆర్ వరదలు (KCR floods)వచ్చినప్పుడు సమీక్షలు కొండగట్టు ప్రమాదంలో చనిపో యిన బాధితులను కనీసం పరా మర్శించారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)అను క్షణం సమీక్షించి స్వయంగా ఖ మ్మం, మహబూబాద్ జిల్లాలలో పర్యటన చేసి అన్ని శాఖల ఉన్న తాధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టారని చెప్పా రు. భారీ వర్షాలు, వరదల కార ణంగా మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయలు ఎక్స్గ్రే షియాను అందిస్తున్నారని, చనిపో యిన పశువులకు,పాడి గేదెలు ఒక్కో దానికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని , మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి రూ. 5 వేల సాయం చేయాలనీ ఆదేశించారని గుర్తు చేశారు.
వర్షాలు, వరదల(Rains and floods) కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పం టలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చే యాలని ఆదేశించారన్నారు. రాష్ట్రంలోనే కాకుండా, జిల్లా కేం ద్రాల్లో కంట్రోల్ రూమ్ లు 24 గంటలు పని చేసే విధంగా ఏర్పా ట్లు చేయాలని, మంత్రులు , ఎంఎ ల్ఏలు (Ministers, MLAs)అధికారులందరూ అప్ర మత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని సీఎం అలర్ట్ చేసిన విషయం బి ఆర్ఎస్ నాయకులకు గుర్తు లేన ట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రె స్ పార్టీ మంత్రులు, ఎమ్మె ల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్య టిస్తూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ, బాధితులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy)ధైర్యాన్ని ఇస్తు న్నారని చెప్పారు. బిఆర్ఎస్ నా యకులకు చేతైనతే సాయం చె య్యలని పని చేసే కాంగ్రెస్ ప్రభు త్వం పైన విమర్శలు చేయడం మానుకొని ప్రజా క్షేత్రంలో ఉండలనీ కోరారు.కాంగ్రెస్ శ్రేణులు అధికారం లో ఉన్న ప్రతిపక్షం లో ఉన్న ఎప్పు డు ప్రజల పక్షమేనని తెలిపారు. ఇంట్లో కూర్చొని రాళ్ళు వెయ్యడం కాదు బయటకు వచ్చి ప్రజలకు సేవ చెయ్యాలనీ బీజీపీ, బిఆర్ఎస్ శ్రేణులను కోరారు.