— కేసీఆర్‌పై వ్యతిరేకత నేపథ్యంతో నే విచారణ కొనసాగుతుంది
–విచారణ కమిషన్ జస్టిస్ నర్సింహా రెడ్డికి మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ
Jagdish Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలపై మీరు జరుపుతున్న విచారణలో నిష్పాక్షికత లేదని, నాటి ప్రభుత్వం అధినేత కేసీఆర్‌పై (kcr) మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్లుగా స్పష్టమవు తోందని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి (Justice L. Narsimha Reddy) మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagdish Reddy) లేఖ రాశారు. విచారణలో భాగంగా ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేయగా, ఈ–మెయిల్ ద్వారా బ దులిచ్చారు. బొగ్గు లభ్యత ఉన్నచో టే విద్యుత్తు ప్లాంట్ నిర్మించాలనేది అర్థం లేని వాదన అని, విదేశీ బొగ్గు ను విధిగా వాడాలనే నిబంధనను కేంద్రం అమలు చేస్తే నౌకాశ్రయాలకు నల్లగొండలోని దామరచర్లనే సమీ పంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏపీలోని పలు ప్రాజెక్టులను బీహెచ్ ఈఎల్‌కు (BHEL)నామినేషన్ పద్ధతిలో ఇచ్చారని, దాంతో పోల్చితే తెలంగా ణ జెన్‌కో అతి తక్కువ ధరకే పని అప్పగించిందని జగదీశ్‌రెడ్డి గుండు చేశారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒ ప్పందం ఆ రాష్ట్ర సీఎం సమక్షంలో జరిగిందని, రెండు ప్రభుత్వాలు, రెం డు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగే ఒప్పందాల్లో ప్రజాధనం దుర్వి నియోగానికి అవకాశాల్లేవని స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌తో యూనిట్ (Chhattisgarh) రూ.3.90కే ఒప్పందం చేసుకున్నా మని, ఆ సమయంలో ఎన్‌టీపీసీ, ఇతర సంస్థల నుంచి యూనిట్‌కు రూ.5–17 దాకా తెలంగాణ చెల్లి స్తోందని పేర్కొన్నారు. పోటీ బిడ్డింగ్ (Competitive Bidding)తో తమిళనాడు, కర్ణాటక యూనిట్ కు రూ.4.94కు కొనేందుకు ఒప్పం దాలు చేసుకున్నాయని గుర్తు చేశా రు. అతి తక్కువ సమయంలో ప్లాం ట్ నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్ ముం దుకొచ్చింది. అందుకే 1,080మెగా వాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను అప్పగించామని, అప్పటికి ఎన్ టీపీసీతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో (Sub-critical technology) తయారయ్యే విద్యుత్తును 90శాతం దాకా ఉత్పత్తి చేస్తున్నాయని వివ రించారు. ఉత్తరాదిలో విద్యుత్ లభ్యత ఉండడంతో దాన్ని తరలిం చడానికే పవర్‌గ్రిడ్‌తో ఒప్పందం చేసుకున్నాం. కానీ, లైన్లు లేక ఇబ్బం దులు వచ్చాయి. తెలంగాణ ఏర్పడే నాటికి 2,700మెగావాట్ల విద్యుత్తు లోటు ఉంది. 400మెగావాట్ల సీలే రు కేంద్రాన్ని ఏపీ లాక్కుంది. పవర్ గ్రిడ్, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగో లు ఒప్పందాలతో తెలంగాణకు మే లు చేకూరింది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పం దంలో ఆ రాష్ట్ర సీఎం, అధికారులు భాగస్వాములు. కేంద్రం కూడా భద్రా ద్రి ప్లాంట్‌కు అనుమతులు ఇచ్చినం దున ఈ వ్యవహారంలో కేంద్రమం త్రులు, అధికారులూ ఉన్నారు. అందరినీ విచారిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కొద్దిమంది సమాచారం తీసుకుని పత్రికా సమా వేశం నిర్వహిస్తే ఒక పక్షం వాదనతో మీరు ఏకీభవించినట్లుగా భావించా ల్సి ఉంటుందని జగదీశ్‌రెడ్డి (Jagdish Reddy) తన లేఖలో ప్రస్తావించారు.