ప్రజా దీవెన, హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలన్నింటిని విడుదల చేయాలని కోరుతూ జనవరి 8న జరిగే బీసీల సమల శంఖారావం గోడ పత్రికలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతు గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిల నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి ముందుగా పేద విద్యార్థుల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని అన్నారు.
ఫీజు రీఎంబర్స్ మెంట్ సాధన కోసం జనవరి 8న హైదరాబాదు లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీల సమర శంఖారావంనీకి పెద్ద ఎత్తున తరలి రావాలని జాజుల పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు బీసీ జేఏసీ కన్వీనర్ గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ ఎర్రబెల్లి దుర్గయ్య సందేనబోయేన జయమ్మ సావిత్రి దోనేటి శేఖర్ బాలాజీ అరవిందు వివేకానంద కరీం సంజన స్రవంతి వినిత మానస లక్ష్మి నాజియా సానియా సమీరా తదితరులు పాల్గొన్నారు