–బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య దర్శి జాజుల లింగంగౌడ్
ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్, అంబే ద్కర్ అని ప్రతీసారి అనే బదులు దేవుని గురించి మాట్లాడుకుంటే ఏడు జన్మల పుణ్యఫలం దక్కు తుందని కించపరిచే విధంగా మాట్లా డటాన్ని నిరసిస్తూ ఓయూ లోని న్యాయ కళాశాల వద్ద నిరస న తెలియజేసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ ను అవ మానపరిచిన కేంద్రమంత్రి అమిత్ షాను తక్షణం కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని అన్నారు.ఈ దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి,భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి,కుల,మతాల అసమానతలను చీల్చి చెండాడి తన జీవితాన్నే త్యాగం చేసిన మహానుభావున్ని అలా అనడం దుర్మార్గం.
అమిత్ షా వేంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని దళిత, బహుజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో వలిగొండ నరసింహ, దర్శన్, విజయ్ నాయక్ వేదాంత మౌర్య లోకేష్ పాపారావు అరుణ్ ఆంజనేయులు రవి మహేశ్ శ్రీనివాస్ వెంకటేష్ సమీర్ అంజి అభి నందు సురేష్ సతీష్ లోకేష్ సంజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.