Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Governor Jishnu Dev Varma: సామాజిక, ఆహారపు అలవాట్ల మార్పుతో పోషకాహార లోపo

–అందరికీ పోషకాహారంపై అవగా హన కార్యక్రమాన్ని ప్రారంభo
–తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Governor Jishnu DevVarma: ప్రజా దీవెన, హైదరాబాద్: ‘పోషణ్ మాస్ (జాతీయ పోషకాహా ర మాసోత్సవం)’ సందర్భంగా కేం ద్ర సమాచార సంస్థ (సీబీసీ) ఆధ్వ ర్యంలో ‘అందరికీ పోషకాహా రం’పై హైదరాబాద్ లో నిర్వ హిస్తున్న అయిదు రోజుల సమగ్ర సమా చార, అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma)సోమవారం ప్రారంభించారు. తెలం గాణ మహిళా విశ్వవిద్యాలయం లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహి ళా, శిశు సంక్షేమ శాఖతో పాటు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ ఐఎన్), భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) వంటి జాతీయ సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొంటారు.

సదస్సులో తాజా ఆహార మార్గదర్శకాలు, స్థూ ల, సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం, ఆహారంలో (Dietary guidelines, importance of macro and micro nutrients in food) పోషక వివరాలను గుర్తించే విధానం వంటి అంశాలతో కూడిన ఫోటో ప్రదర్శనను నిర్వ హించారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రద ర్శించిన వివిధ చిత్రాలు తాలూకు వివరాలను పీఐబీ, సీబీసీ అదన పు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ దగ్గరుండి గవర్నర్ కు వివరించారు.

ఎన్ఐఎన్, ఎఫ్ఎస్ఎ స్ఏఐల సమన్వయంతో కేంద్ర సమాచార సంస్థ కచ్చితమైన సమాచారాన్ని సేకరించి ఈ ఎగ్జిబి షన్ లో ప్రద ర్శించింది. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్ర మంలో ‘అం దరికీ పోషకాహారం’ ఇతివృత్తంపై మొత్తం 40 అంశాలను ప్రదర్శిం చారు. ఇలా తెలుగులో ఏర్పాటు చేయడం వల్ల సమాచారం మరిం త ఎక్కువ మందికి చేరుతుం దంటూ గవర్నర్ ప్రశంసించారు. ఐసీ ఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ, రాష్ట్ర మహి ళాభివృద్ధి-శిశు సంక్షేమ శాఖ, కేంద్ర ప్రచురణల విభాగం, న్యూట్రి హబ్, భారత చిరుధాన్యాల (Nutri Hub, Indian Snacks)పరిశోధన సంస్థ, విశ్వవిద్యాలయ ఆహార- పోషక విభాగం కూడా ఈ కార్య క్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేశాయి.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడు తూ వివిధ రకాల సంస్కృతులు, భాషలతో కూడిన వైవిధ్యభరితమై న మన దేశంలో పోషకాహార అం శాలపై అవగాహనతో కూడిన సమాచారాన్ని ప్రజలందరికీ చేర వేయడం ఒక సవాలని అన్నారు. సృజనాత్మక వ్యూహాల ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించి పోషకా హారంపై సామాజిక నడవడికలో పరివర్తన తేవడమే పోషణ్ అభి యాన్ లక్ష్యమని ఆయన అన్నా రు. పోషకాహారంపై (On nutrition)సందే శాలతో బుర్రకథ, పల్లె సుద్దుల వంటి జాన పద కళారూపాలను గవర్నర్ వీక్షించి, ఆ ప్రయత్నాన్ని ప్రశంసిం చారు. దేశవ్యాప్తంగా కూడా ఈ తరహా ప్రయత్నాలు చేయాలని సూచించారు. రక్తహీనత నిర్మూ లన, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంపై కళా రూపాల ద్వారా సందేశం అందిం చడం వల్ల అది కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలు సహా చేరాల్సిన వారందరికీ చేరు తుందని ఆయన అన్నారు.

‘వికసిత్ భారత్’ సాధించే దిశగా ప్రభుత్వంతో కలసి అడుగేయాలని గవర్నర్(Governor)_ పిలుపునిచ్చారు. దీనిలో ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా శారీరక, మానసిక శ్రేయస్సు మిళితమై ఉందన్నారు. ‘పోషణ్ బీ పడాయి బీ పథకం’ అంగన్వాడీ కేంద్రాలను (Anganwadi Centers) పోషకాహారం, విద్య అందించే సమీకృత హబ్ లుగా మారుస్తుందని తెలిపారు. ఈ విధానం శారీరక, మానసిక వికాసం పెంపొందించి మంచి భవిష్యత్తు ఇస్తుందన్నారు.పీఐబీ, సీబీసీ అద నపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ మాట్లాడుతూ ఇటీవలే ప్రసారమైన మన్ కీ బాత్ కార్య క్రమంలో భావిపౌరులైన చిన్నారు లకు పోషకాహార ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారని అన్నారు.

ఆరో గ్యకరమైన సమాజాన్ని రూపొందిం చేందుకు అందరూ తమ వంతు పాత్ర పోషించాలని ప్రధాని పిలుపు నిచ్చారని, దాన్ని సాకా రం చేసే దిశగా చేపట్టిన చిరు ప్రయత్నమే ఈ ఫొటో ఎగ్జిబిషన్’’ అని తెలిపా రు. జాతీయ పోషకాహార సంస్థ ఐసీఎంఆర్ జీవ రసాయన శాస్త్ర విభాగ అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ జి భాను ప్రకాశ్ రెడ్డి, తెలం గాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎమ్ విజ్జుల్లత, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి విభాగ అధికారులు, తెలం గాణా ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్(ప్రధానమంత్రి సమగ్ర పోషణ పథకం) కార్యక్ర మాన్ని రాజస్థాన్ లోని ఝున్ ఝును జిల్లాల్లో మార్చి8, 2018న ప్రధానమంత్రి ప్రారంభించారు. కౌమార బాలికలు, గర్భిణీలు, బాలిం తలు, 0-6 ఏళ్ల వయసున్న పిల్లల్లో పోషకాల స్థాయి పెంచడం పై ఈ పథకం దృష్టిసారిస్తుంది.