Jishnudev Verma: ప్రజా దీవెన,హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma) బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం (Oath taking)చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో త్రిపురలోని తన నివాసమైన కుం జబన్ ప్యాలెస్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సంధర్బంగా విమానాశ్రయంలో జిష్ణుదేవ్ వర్మ కు (Jishnudev Verma) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy)స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా సాయుధ దళాల సమర్పించిన గౌరవ వందనం స్వీకరించారు. అలాగే కొత్త గవర్నర్ కు (The new governor) స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.