Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Job calendar: జాబ్ క్యాలెండర్ శుభవార్త రానే వచ్చింది

–2025 ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాల వెల్లడి
–అసెంబ్లీలో విడుదలతో స్పష్టం చే సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
–అక్టోబరులో గ్రూప్‌–1 మెయిన్స్‌, మరో నోటిఫికేషన్‌ జారీ
–వచ్చే ఏడాది వరకు నిర్దిష్ట తేదీ లతో షెడ్యూల్ విడుదల

Job calendar: ప్రజా దీవెన, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt)నిరుద్యోగులకు తీపికబురు అందించింది. తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అనుకుంటూ ఎదురుచూపుల జాబ్ క్యాలెండర్ రానే వచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ను (job calender)ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసిం ది. వచ్చే ఏడాది ఆగస్టులోపు ఏయే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి, ఆ యా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తురు అనే సమా చారంతో క్యాలెండర్‌ను ఇచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ జాబ్‌ క్యాలెండర్‌ (job calender) ద్వారా ప్రభు త్వం గ్రూప్‌–1 అభ్యర్థులకు తీపిక బురు చెప్పింది. జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవ రిలో జారీ అయిన గ్రూప్‌–1 నోటిఫి కేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలను అక్టోబరులో నిర్వహిoచ నున్నారు.

అదేవిధంగా అక్టోబరు నెలలో మరికొన్ని గ్రూప్‌–1 ఉద్యో గాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌, జూలై లో మెయిన్స్‌ నిర్వహిస్తారు. ఇక డిసెంబరులో గ్రూప్‌–2 పరీక్షలు జరగనున్నాయి. ఇక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నవం బరు, 2025 ఏప్రిల్‌లో టెట్‌ నోటిఫి కేషన్లు వెలువడనున్నాయి. అలాగే, ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇక, ఎస్సై, కానిస్టే బుల్‌ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో నోటి ఫికేషన్లు జారీ చేసి ఆగస్టు నెలలో అర్హత పరీక్షలు నిర్వహించను న్నారు. వీటితోపాటు గ్రూప్‌–3 సర్వీసులు, వైద్య శాఖ, విద్యుత్‌, ఇంజనీరింగ్‌ (Group-3 Services, Medical, Electrical, Engineering)విభాగాల్లో కొలువుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ జాబ్‌ క్యాలెండర్‌లో ఆయా విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు. జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత కల్పించాలని భావించినా ప్రభుత్వం ప్రకటనకే పరిమితమైంది.

నిరుద్యోగులకిచ్చిన హామీ నెర వేరుస్తాం నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద ని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి, అలాంటి పొరపాట్లు పున రావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుని జాబ్‌ క్యాలెండర్‌ రూపొం దించామని పేర్కొన్నారు. ఈ మేర కు శాసనసభలో మాట్లాడిన మంత్రి భట్టి విక్రమార్క గత ప్రభుత్వ హ యాంలో పేపరు లీకేజీలతో నిరు ద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యా రని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్‌ను నియ మించడంతోపాటు బోర్డులో సంస్క రణలు అమలు చేశామని చెప్పా రు.

యూపీఎస్సీ, కేరళ పబ్లిక్‌ సర్వీ స్‌ (UPSC, Kerala Public Service S)కమిషన్‌ అనుసరిస్తున్న పద్ధతు లు, విధానాలను అర్థం చేసుకునేం దుకు సీనియర్‌ ఐఏఎస్‌లతో రెండు కమిటీలను వేసి వారి సూచనలు అమలు చేశామని గుర్తు చేశారు. పాత గ్రూప్‌–1 రద్దు చేసి 60 పోస్టు లు జత చేసి 563 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రిలిమ్స్‌ నిర్వహించడమే కాక ఫలితాలు కూ డా ప్రకటించామన్నారు. అక్టోబరు 21–27 వరకు మెయిన్స్‌ కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే 32,410 మందికి ఉద్యోగ నియామక ఉత్త ర్వులు జారీ చేశామన్నారు. అద నంగా 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీ కి అనుమతులు కూడా ఇచ్చామ న్నారు. 11,062 ఖాళీలతో ఉపా ధ్యాయ నియామకాలకు డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో 45 పోస్టులను నియమించబోతున్నామని భట్టి తెలిపారు.

నోటిఫికేషన్‌ పేరు పోస్టు పేరు…
–గ్రూప్‌–1 మెయిన్స్‌ గ్రూప్‌–1 20 24 ఫిబ్రవరి 2024 అక్టోబరు టీజీపీ ఎస్సీ
–గ్రూప్‌–3 సర్వీసెస్‌ గ్రూప్‌–3 202 2 డిసెంబరు 2024 నవంబరు టీజీ పీఎస్సీ
–ల్యాబ్‌ టెక్నిషియన్స్‌, నర్సింగ్‌ ఆఫీ సర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌
–ఫార్మసిస్ట్‌ ఫార్మసిస్ట్‌ 2024 సెప్టెంబ రు 2024 నవంబరు ఎంహెచ్‌ఎ స్‌ఆర్‌బీ
–గ్రూపు్‌–2 సర్వీసెస్‌ గ్రూప్‌–2 202 2 డిసెంబరు 2024 డిసెంబరు టీజీ పీఎస్సీ
–ట్రాన్స్‌కోలో ఇంజనీర్లు ఏఈఈ 20 24 అక్టోబరు 2025 జనవరి ట్రాన్స్‌ కో
గెజిటెడ్‌ కేటగిరిలో …
–ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఏఈఈ 2024 అక్టోబరు 2025 జనవరి టీజీపీఎస్సీ
–టెట్‌ టీచర్‌ 2024 నవంబరు 2025 జనవరి స్కూల్‌ ఎడ్యుకేషన్‌
–గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ గ్రూప్‌–1 2024 అక్టోబరు 2025 ఫిబ్రవరి టీజీపీ ఎస్సీ
–గెజిటెడ్‌ స్కేల్‌ సర్వీసెస్‌ అన్ని విభాగాలు 2025 జనవరి 2025 ఏప్రిల్‌ టీజీపీఎస్సీ
–డీఎస్సీ టీచర్లు 2025 ఫిబ్రవరి 2025 ఏప్రిల్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌
–ఫారెస్ట్‌ విభాగం బీట్‌ ఆఫీసర్లు 2025 ఫిబ్రవరి 2025 మే టీజీపీఎస్సీ
–టెట్‌ టీచర్లు 2025 ఏప్రిల్‌ 2025 జూన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌
–గ్రూపు–1 మెయిన్స్‌ గ్రూపు–1 –– 2025 జులై టిజిపిఎస్‌సి
–పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 2025 ఏప్రిల్‌ 2025 ఆగస్టు టీజీపీఆర్‌బీ
–పోలీస్‌ కానిస్టేబుల్‌ 2025 ఏప్రిల్‌ 2025 ఆగస్టు టీజీపీఆర్‌బీ