Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Job calendar: జాబ్ క్యాలెండర్ ‘గ్యారంటీ ‘ బోగస్

–గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ల నిరసన
–కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని ఆరోపణ

Job calendar:ప్రజా దీవెన, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt)యువతను మభ్యపెడు తోందని నిరుద్యోగులకు భయపడి, నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చి జాబ్‌ క్యాలెండర్‌ (Job calendar) అని ప్రకటించారని బీఆర్‌ఎస్‌ వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపిం చారు. ప్రభుత్వం ప్రటించిన జాబ్‌ క్యాలెండర్‌ గ్యారంటీ బోగస్‌ అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ ఆధ్వర్యం లో శుక్రవారం గన్‌పా ర్కు వద్ద నిర సనకు దిగారు.

ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. జాబ్‌ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్ట లేదని దీనిపై అసెంబ్లీలో చర్చించాల ని అడిగితే రెండు నిమిషాలు కూడా టైమ్‌ ఇవ్వలేదని కేటీఆర్‌ మండి పడ్డారు.ఈ సమయంలో రాహుల్‌, రేవంత్‌ అశోక్‌నగర్‌కు రాగలరా వచ్చే దమ్ముందా అని సవాల్‌ విసిరారు. వారిద్దరూ అశోక్‌నగర్‌కు వస్తే యువత తన్ని తరిమేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ శాడిస్ట్‌ ముఖ్యమంత్రి అందరినీ ఉసిగొలు పుతూ బజారు భాష మాట్లాడిస్తూ పైశాచికానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ఇంత దిగజారు డు, దివాలాకోరు సీఎంను ఎప్పు డూ చూడలేదని అన్నారు.

తెలంగాణ యువత (Telangana Youth)తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంత బజారు భాషలో తిట్టిస్తారా అని ఆవేదన వెలిబుచ్చా రు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్‌ ఇచ్చి మరీ తిట్టించారని ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనస భ దుశ్శాసన సభగా మారిందని, ఇందిరమ్మ రాజ్యం అంటూనే కాంగ్రె స్‌ ప్రభుత్వం (Congress Govt) మహిళల గౌరవానికి భంగం కలిగిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.

సభా నాయకుడే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారని దానం నాగేందర్‌ మాట్లాడిన భాష రౌడీ షీటర్‌ మాట్లాడే భాషలా ఉందని దుయ్యబట్టారు.గురువారం అసెంబ్లీ లో మహిళా ఎమ్మెల్యేలను అవమా నించారని, శుక్రవారం దానం నాగేం దర్‌ వ్యాఖ్యలు కన్నతల్లులను అవ మానపరిచే విధంగా ఉన్నాయని, మాతృత్వం విలువ తెలియని వారే ఇలా మాట్లాడుతారని మండిపడ్డా రు.

ఆయన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ (demand) చేశారు. బజారు భాష మాట్లాడిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసి న అక్బరుద్దీన్‌ ఓవైసీకి ఆయన ధ న్యవాదాలు తెలిపారు.హైదరాబాద్‌ ఏమైనా దానం నాగేందర్‌ జాగీరా అ సెంబ్లీలోనే ఇలా మాట్లాడితే ఇక్క డికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించిన హరీశ్‌ శాసనసభ చరిత్ర లోనే ఇది చీకటిరోజని పేర్కొన్నారు. నిరసనలో ఎమ్మెల్యేలు (mlas)వేముల ప్రశాం త్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబిత, కోవ లక్ష్మితోపాటు పలువు రు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు.

కాగా.. తెలంగాణభవన్‌లో నిరు ద్యోగులతో కలిసి మీడియాతో మాట్లాడిన హరీశ్‌ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ అయినా ఇచ్చావా రేవంత్‌ తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ఏం చేశావని నిలదీశారు. జాబ్‌క్యాలెండ ర్‌లో పేరు, సంతకం లేవని ఓ చిత్తు కాగితంలా దాన్ని ప్రకటించారని మండిపడ్డారు.