Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

JP Nadda: లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు

–పక్షం రోజుల్లో 40లక్షల సభ్యత్వం నమోదు పూర్తి
–స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావ హులకు అందడండ
–రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం

JP Nadda: ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాబో యే 15 రోజుల్లో 40 లక్షల పార్టీ స భ్యత్వాల నమోదు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ రా ష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అ ధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తితో ఉన్న వారి నాయకత్వాన్ని ప్రోత్సహించి పార్టీ సభ్యత్వాలు సా ధించాలని అన్నారు. హైడ్రా, రైతు సమస్యలపై ప్రజాపోరాటాలు చేస్తూనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో పార్టీ ముఖ్య నేతలతో శనివారం సమావేశమైన జేపీ నడ్డా (JP Nadda)పార్టీ స భ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వ హించారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యం కాగా ఇప్పటివరకు 10 లక్షల సభ్యత్వా లు నమోదయ్యాయని మిగిలిన 40 లక్షలను 15 రోజుల్లోగా పూర్తి చేసేలా పని చేయాలని నేతలను కోరారు. ఈ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో (MPs and MLAs) పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రత్యేక చొరవ తీసుకో వాలని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీజేపీ (bjp)అధి కారం చేపట్టడమే లక్ష్యంగా నేతలు పని చేయాలని సూచించారు. యు వతను ప్రోత్సహించి పార్టీని బలో పేతం చేయాలని కోరారు. జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల పనుల్లో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) ఈ సమీక్షకు గైర్హాజరవ్వగా పార్లమెం టరీ బోర్డు సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మ ణ్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నా రు. కాగా, గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి న అభ్యర్థులల్లో సగం కంటే ఎక్కు వ మంది ఈ సమావేశానికి దూరం గా ఉండడం గమనార్హం. అంతక ముందు శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరు కున్న జేపీ నడ్డాను బండి సంజయ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు స్వాగతించారు.