Kadem project: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పో టెత్తింది. దీంతో అధికారులు18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదు లుతున్నారు. కడెం ప్రాజెక్టు(Kadem project)పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు 7.603 టీఎంసీలు. కాగా, ప్రస్తుత నీటి మట్టం 694. 300 అడుగు లు,6.198 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో (In flow) 194039 క్యూసెక్కులు. ఉండగా, అవుట్ ప్లో 249054 క్యూసెక్కులుగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురు స్తున్నాయి. భారీ వర్షాల నేప థ్యంలో వాతావరణశాఖ హెచ్చరి కలతో (Meteorological department warning)అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించిం ది. కలెక్టరేట్లలో కంట్రోలు (Controls in Collectorates)రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించిది. ఇరిగేషన్, హెల్త్ సిబ్బందికి సెలవు లు రద్దుచేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.