Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaleshwaram project: కాళేశ్వరం ‘కమిషన్ ‘

–విచారణకు హాజరైన ఇంజనీర్ల బృందం
–వివరాలు సేకరిస్తున్న విచారణ అధికారులు

Kaleshwaram project:ప్రజాదీవెన, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) సంబంధించిన ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) సోమవారం ఉదయం పంప్ హౌస్​లకు సంబంధించిన ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారిస్తోంది. ప్రాజెక్టు మొదటి లింక్​లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల ఎగువన ఉన్న లక్ష్మీ, సరస్వతి, అన్నారం పంప్​హౌస్​లకు చెందిన ఇంజినీర్లను విచారణకు పిలిచారు. చీఫ్ ఇంజినీర్ మొదలు ఏఈఈ వరకు ఇంజినీర్లు విచారణకు హాజరవుతున్నారు.

ఇవాళ 14 మంది ఇంజినీర్లు కమిషన్ (Commission of Engineers)ముందు హాజరవుతున్నారు. పంప్​హౌస్​ల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పూర్తి నిల్వ సామర్థ్యం, పంప్​హౌజ్​ల లెవల్, నీటి ఎత్తిపోత తదితర అంశాల గురించి అవసరమైన సమాచారం, వివరాలు సేకరించడంతో పాటు ఆ తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకోనున్నారు. గతంలో పంప్​హౌస్​లు మునిగినప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు, కారణాలు సహా ఇతర అంశాలపై కూడా కమిషన్ దృష్టి సారించనుంది. ప్రాజెక్టుకు (project)సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వండి : ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఇటీవల ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటి పారుదల శాఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్ఏ ఛైర్మన్​తో ఆయన మాట్లాడినట్లు సమాచారం. పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్​కు కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది.

కమిషన్​కు (Commission)సహాయంగా ఉండేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh Commission) శనివారం సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటికే ఆనకట్టలను అధ్యయనం చేసినందున ఆ అంశాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇప్పటి వరకు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతోంది. వాటి పరిశీలన తర్వాత అవసరమైన వారికి నోటీసులు (notice) జారీ చేసి విచారణ చేయనున్నారు.