Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రైతు రుణ మాఫీ అందరికీ చేయాలని గురు వారం నల్గొండ గడియారం సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింప జేయాలని, ఏఎంఆర్పి డిస్ట్రిబ్యూ టరీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) నాయక త్వంలో నల్లగొండ నియోజకవర్గం చెందిన రైతులు, బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సంధర్బంగా కంచర్ల మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని అరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంట నే రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ద్వజమెత్తారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఆగస్టు 15 లోగా సగం మంది కూడా రుణమాఫీ చేయకుండా రైతన్నతో చెలగాటమాడుతు న్నాడని దుయ్యబట్టారు.
రైతులం దరూ ఈ విషయాన్ని గ్రహించుకొని ప్రభుత్వం మీద తిరగబడాలని కోరారు. తిరుమలగిరి లో రైతుల కోసం ధర్నా చేస్తున్న తమ పార్టీ నేతల శిబిరం పై కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడం హేయ మైన చర్య అని తీవ్రంగా ఖండిం చారు. అదేవిధంగా ఎమ్మార్పీ కాలు లకు వెంటనే నీటిని విడుదల చేసి నల్గొండ నియోజకవర్గం రైతుల పంటలను కాపాడాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి (MC Kotireddy)మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ (demand) చేశారు. వానాకాలం రైతు భరోసా ఎకరాకు 7500/- రూ. లు చొప్పున వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
రైతులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ధర్నా లో. రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి.. పార్టీ రాష్ట్ర నాయకులు చీరా పంకజ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, మాలే శరణ్య రెడ్డి, బక్క పిచ్చయ్య,నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, నారా బోయిన బిక్షం,కంచనపల్లి రవీందర్రావు,గాదె రామ్ రెడ్డి ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్.. పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్..
నల్గొండ కనగల్ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు.. దేప వెంకట్ రెడ్డి అయితగోని యాదయ్య పల్ రెడ్డి రవీందర్ రెడ్డి (Ravinder Reddy).. కౌన్సిలర్ మారగొని గణేష్, కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి యుగంధర్ రెడ్డి,..దండంపెల్లి సత్తయ్య, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి ఊట్కూరు సందీప్ రెడ్డి, మెండు మణిపాల్ రెడ్డి, పొగాకుగట్టయ్య,కడారి కృష్ణయ్య, శ్రీనాథ్, జి జంగయ్య,నారగోని నర్సింహా,బొజ్జ వెంకన్న,పేర్ల అశోక్,కందుల లక్ష్మయ్య, బడ్పుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, కకూరి వీరాచారి, తిప్పర్తి మహిళా అధ్యక్షురాలు కొండ్రస్వరూప, పట్టణ మహిళా కార్యదర్శి గాలి రాధిక,.. కంకణాల వెంకటరెడ్డి పెరిక యాదయ్య, బొజ్జ సైదులు, కుందూరు ప్రవీణ్ రెడ్డి, వజ్జ శ్రీనివాస్, షబ్బీర్, వొవైజ్ షా, సింగిరికొండ శివకుమార్, వీరమల్ల భాస్కర్.. తగుళ్ల శ్రీను, బొల్లెద్దు వెంకన్న పలువురు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..