–ఆ పార్టీ లు చీకటి ఒప్పందo చేసుకున్నాయి
–ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ మంత నాలు జరుపుతున్నారు
–ఇప్పటికీ 70 శాతం రుణమాఫీ కానే కాలేదు
KAVITHA: ప్రజా దీవెన హైదరాబాద్: జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు (KAVITHA )బెయిల్ ఇప్పించడానికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకుని ఒక్క టవుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన అభిషేక్ సింఘ్వీని ఇప్పుడు రాజ్యసభకు పోటీ చేయిస్తున్నదే కేసీఆర్ అని ఆరోపించారు. కూతు రి బెయిల్ కోసం కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరు పుతున్నారన్నాని చెప్పారు. వారికి కావాల్సినంతము ట్టజెప్పుతున్నా రని.. దీంతో ఫోన్ ట్యాపింగ్, కాళే శ్వరం వంటి కేసులన్నింటి నుంచి కేసీఆర్‌కు (KCR)ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తు క్కుగూడ మునిసిపాలిటీలోని రావి రాలలో మంగళవారం జరిగిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాల వేడు కలకు సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని బీజేపీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నా యని అందులో భాగంగానే బీజేపీ లో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అంతా బోగస్ అని, ప్రభుత్వం దానిపై శ్వేతపత్రం విడుదల చేయా లని డిమాండ్ (demand) చేశారు. 70 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలే దని సంజయ్ అన్నారు.
సీఎం పీఠంపె పొంగులేటి కన్ను: ఏలేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సీఎం పీఠంపై కన్నేశారని బీజే ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (BJLP leader Aleti Maheshwar Reddy)ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మె ల్యేల కొనుగోలులో, రూ.వేల కోట్ల కాంట్రాక్టుల్లో ముందంజలో ఉన్న ఆయన.. ఇంకా పెద్ద పదవి (సీఎం) పై కన్నేసినట్లుగా అనిపిస్తోందన్నా రు. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి ఒకరు తనతో చెప్పారని ఏలేటి పేర్కొన్నారు. మంగళవారం బీజే ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, హెచ్‌ఎండీఏ పరిధిలో గత 30 ఏళ్లలో జరిగిన అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కె.వెంకటరమ ణారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఇళ్ల అనుమతుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవడం మానేసి హైడ్రా పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని నిలదీశారు. రైతు రుణమాఫీ ఓ నంబర్ గేమ్ అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో, బొంరాస్‌పేట్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ (demnad)చేశారు.
కాశ్మీర్ ఇన్‌చార్జులుగా రాంమా ధవ్, కిషన్‌రెడ్డి (Ramma Dhav, Kishan Reddy)జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జులుగా పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్య దర్శి రాంమాధవ్.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ జాతీయ అధ్య క్షుడు నడ్డా నియమించారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.