Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KC Venugopal: మంత్రులు, ఎమ్మేల్యేలు పనితీరు మెరుగుకు పదునుపెట్టండి

–మీ అందరి తీరుపై కార్యకర్తలు అంత సంతోషంగా లేరు
–ప్రచారం ప్రజల్లోకి వెళ్లేలా పీసీసీ చూడాలి
— గాంధీభవన్ పీఏసీ భేటీలో కేసీ వేణుగోపాల్‌ నిర్దేశం

KC Venugopal: ప్రజా దీవెన, హైదరాబాద్‌: అధికా రం వచ్చి ఏడాది గడిచింది, మీరు పదవులు అనుభవిస్తున్నారు, ఇక నైనా పార్టీని అధికారంలోకి తీసు కువచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయండి, వారిని కాపాడుకోండి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసి వారికి అవకాశం కల్పిం చండని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ టీపీసీసీ రాజ కీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కాంగ్రెస్‌ నేతలకు హితబోధ చేశారు. మంత్రులు తమ పనితీరును మెరుగు పరుచుకోవా లని, వారి పనితీరుకు సంబంధిం చిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని సుతిమెత్తగా హెచ్చరిం చారు. మంత్రుల పనితీరు పట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల పనితీరు పట్ల పార్టీ కార్యకర్తలూ సంతోషంగా లేరని, దీనిని సరిదిద్దుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో వా రానికోసారి నిర్వహిస్తున్న మం త్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ నెలకోసారి నిర్వహిం చాలన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు దగ్గర కా వాలన్నారు. ఏడాది కాలంలో ప్రభు త్వం అమలు చేసిన సంక్షేమ కార్య క్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి, పీఏసీ సభ్యులు వివరించగా వాటి అమ లుతీరుపై వేణుగోపాల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్ర మాలకు సంబంధించిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లడంలేదని, పార్టీ సోష ల్‌ మీడియా వింగ్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనిని ప్రజల్లోకి విస్తృ తంగా తీసుకెళ్లే కార్యాచరణను అ మలు చేయాల్సిందిగా పీసీసీకి సూ చించారు. ఇక 2025 సంవత్సరా న్ని పార్టీ సంస్థాగత నిర్మాణ సంవ త్సరంగా తీసుకోవాలని వేణుగో పాల్‌ అన్నారు. బ్లాక్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మా ణాన్ని త్వరితగతిన ఏర్పాటు చే యాలని సూచించారు. ఆయన సూచన మేరకు నెల రోజుల్లో ఈ కమిటీలను వేయాలని, త్వరిత గతిన నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాలని పీఏసీ నిర్ణయించింది.

ప్రతి నెలా పీఏసీ సమావేశం నిర్వ హించాలన్న నిర్ణయమూ జరిగింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, లేదంటే ఆ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంద ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు మార్‌ పీఏసీ సమావేశంలో అభిప్రా యపడ్డారు. కాగా, ఏడాదిపాటు సంవిధాన్‌ బచావ్‌ కార్యక్రమాలు తీసుకోవాలని ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణ యాన్ని కేసీ వేణుగోపాల్‌ పీఏసీ లో వివరించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని సూచిం చారు. అయితే ఈ నెల 26 నుంచి 28 మధ్యలో హైదరాబాద్‌లో సంవి ధాన్‌ బచావ్‌ ర్యాలీని నిర్వహిస్తా మని, దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ సమయం ఇవ్వాలని పీఏసీ సభ్యులు కోరారు. దీనిపై వారిని సంప్రదిస్తానని వేణుగోపాల్‌ చెప్పారు.

త్వరలోనే స్థానిక సమరం
–సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
–కాంగ్రెస్‌ కార్యకర్తలకు సీఎం రేవం త్‌ రెడ్డి పిలుపు

ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తు న్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అందువల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి అధ్యక్షతన గాంధీభవన్‌లో బుధవారం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీలో సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 26 నుంచి రైతు భరోసా అందించబోతు న్నామని, వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ. 12 వేల చొప్పున ఇవ్వనున్నామని చెప్పారు. కొత్త రేషన్‌ కార్డులూ ఇవ్వనున్నామన్నారు.

అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతులకు రూ.21 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేశామని తెలిపారు. రైతు సంక్షేమానికి రూ.54వేల కోట్ల మేర ఖర్చు చేశామన్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి తదితర పధకాలను ప్రస్తావించారు. ఆయా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇక, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు తెలియజేశామని తెలిపారు. కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీఏసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మన్మోహన్‌సింగ్‌కు పీఏసీ నివాళి

సమావేశం ప్రారంభానికి ముందు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సీఎం రేవంత్‌ తదితరులు నివాళి అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మన్మోహన్‌కు సంతాపం తెలిపామని, భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేశామని గుర్తు చేశారు.