KCR Bus Trip Schedule: మిర్యాలగూడ టు సిద్దిపేట
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్న భారత్ రాష్ట్ర సమితి(BRS) అధినేత కేసీఆర్ బుధవారం నుంచి రోడ్ షోలు ప్రారంభించనున్నారు.
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
ఈనెల 24 నుంచి రోడ్ షోలు
ప్రచారం ఉధృతం చేసిన బీఆర్ఎస్
ప్రజాదీవెన, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్న భారత్ రాష్ట్ర సమితి(BRS) అధినేత కేసీఆర్ బుధవారం నుంచి రోడ్ షోలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈ నెల 24 వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు ఉంటాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు, నాలుగు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. మే 10న సిద్దిపేటలో ఈ యాత్ర ముగుస్తుంది.
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే(KCR Bus Trip Schedule)
ఈ నెల 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో
25న భువనగిరి
26న మహబూబ్‌నగర్
27న నాగర్‌కర్నూల్
28న వరంగల్
29న ఖమ్మం
30న తల్లాడ, కొత్తగూడెం
మే 1న మహబూబాబాద్
2న జమ్మికుంట
3న రామగుండం
4న మంచిర్యాల
5న జగిత్యాల
6న నిజామాబాద్
7న కామారెడ్డి, మెదక్
8న నర్సాపూర్, పటాన్‌చెరు
9న కరీంనగర్
10న సిరిసిల్ల, సిద్దిపేట
ఏప్రిల్ 24నుంచి కేసీఆర్ బస్సు యాత్ర – మిర్యాలగూడలో ప్రారంభం –
రోడ్ షోలలో భాగంగా ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను కేసీఆర్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రైతులను (Farmers)పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలకు తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకొని కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి. ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ విస్తృత ప్రచారం సాగించనున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుంటూ తమకు ఓటు వేస్తే పార్లమెంటులో రాష్ట్రం కోసం గళం ఎత్తుతామని చెప్పనున్నారు. అలాగే ఈరోడ్ షోలలో ముఖ్యంగా కేసీఆర్ తమ ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇటీవలే ఓ సభలో పాల్గొన్న గులాబీ బాస్, ఇక ఉద్యమం నాటి కేసీఆర్ను ప్రజలు చూడబోతున్నారని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్రలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
KCR Bus Trip Schedule