— సభ్యత్వ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలి
–పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్ : బీజేపీ కేడర్ బేస్డ్ పార్టీ (BJP is a cadre based party)అని, వ్యక్తుల కోసం కాకుండా దేశం కోసం పనిచేసే పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)అన్నారు. నాంపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలందరూ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ అని తెలిపారు.
సభ్యత్వ నమోదుతో పార్టీ మరింత బలోపేతం…
పార్టీ మరింత బలపడేందుకు సభ్యత్వ నమోదు చేయాలని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త వంద మందిని సభ్యులుగా చేర్పించాలని కోరారు. సభ్యత్వ నమోదును ఒక ఉద్యమంలాగా చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని, దీనికి సభ్యత్వం కీలకమని తెలిపారు. ఆన్ లైన్ సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 77లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు. వేలాది బూత్ లలో బీజేపీ (bjp) నంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటికి తూట్లు పొడుస్తుందన్నారు.
50శాతం కూడా రుణమాఫీ జరగలేదు..
రాష్ట్రంలో 50శాతం కూడా రుణమాఫీ జరగలేదని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై వాస్తవ పరిస్థితులు బయట పెట్టాలని, లేకుంటే ఆ వివరాలు బీజేపీయే (bjp) బయట పెడుతుందన్నారు. ఏ గ్రామంలో రుణమాఫీ పూర్తిగా కాలేదని చెప్పారు. ఒక వైపు సభ్యత్వం చేస్తూనే రైతుల సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే (Hyderabad Liberation Day)ను చేయాలన్నారు.