Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy:సింగరేణి లో సజీవ సమాధి

–మరమ్మతు పనులు చేస్తుండగా కూలిన మట్టి, ఇద్దరు మృతి
–మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు
–రామగుండం–3 డివిజన్‌ ఓసీపీ–2 లో ఘటన
— కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విచారం

Kishan Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులో (Singareni is an opencast project) ప్రమాదం సం భవించింది. పైపులైన్‌ లీకేజీ (Pipeline leakage) మర మ్మతు చేస్తున్న ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయ పడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామగుండం–3 డివిజన్‌ పరిధి ఓసీపీ–2లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వారీలోని సౌత్‌కోల్‌ ఏరియాలో సైడ్‌వాల్‌ లోపల పైపులైన్‌ లీకేజీ (Pipeline leakage) అవుతుం డడంతో బుధవారం నలుగురు కార్మికులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే హైవాల్‌లో బురద మట్టి(ఓబీ) వర్షానికి నాని పోయి ఒక్కసారిగా కార్మికులపై కూలింది. దీంతో సింగరేణి టెక్నీ షియన్‌(ఫిట్టర్‌) ఉప్పుల వెంకటే శ్వర్లు(58), జనరల్‌ మజ్దూర్‌ కార్మికుడు గాదం విద్యాసాగర్‌(55) ఆ మట్టిలో కూరుకుపోయి ప్రాణా లు కోల్పోయారు.

కాగా, కూలిన మట్టిలో వచ్చిన బండరాళ్లు (Boulders)అక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరు జనరల్‌ మజ్దూర్‌ కార్మికులు శ్రీనివాస్‌రాజు, మాదాం సమ్మయ్యకు తగలడంతో.. వారికి తీవ్రగాయాలయ్యాయి. క్వారీలోని మిగతా కార్మికులు ఘటనా స్థలానికి చేరుకొని కూలిన మట్టిని షావల్‌ సహాయంతో తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.గాయపడ్డ కార్మికులకు తొలుత స్థానిక సెంటినరీ కాలనీలోని డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స అం దించి.. తర్వాత గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి (Godavarikhani Area Hospital)తరలించారు. మృతుల్లో.. ఉప్పుల వెంకటేశ్వర్లు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, గాదం విద్యాసాగర్‌ గోదావరిఖనికి చెందిన వ్యక్తి. ప్రమాద ఘటనపై సింగరేణి సీఎండీ బలరాం విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. కాగా, సింగరేణి కార్మికులు మృతి చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుల భద్రత విషయంలో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.