Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy: సమిష్టిగా హైదరాబాద్ అభివృద్ధికి కృషి

— కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: మాదాపూర్, హైటెక్ సిటీ (Madapur, hi-tech city) కాదు పాత బస్తీని అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ప్రభుత్వానికి సూచించారు. సికింద్రాబాద్ అసెం బ్లీ, బౌద్ధ నగర్ డివిజన్, పార్సిగుట్ట లో సొంత నిధులతో (ఎంపీ లాడ్స్) తో నిర్మించిన రెండంతస్థుల కమ్యూ నిటీ హాల్ ను కిషన్ రెడ్డి ప్రారంభిం చారు.ఈసంద‌ర్భంగా ఆయ‌న మా ట్లాడుతూ హైదరాబాద్ లో కలిసి కట్టుగా మౌలిక వసతులు కల్పించా ల్సిన అవసరం ఉందన్నారు.


బస్తీ ల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభి వృద్ధి, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ (Construction of roads, development of parks, drinking water, drainage system)ఆధునీకరణ, వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలని తెలి పారు. స్థానికంగా రెవెన్యూ వస్తు న్నప్పటికీ కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేద న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొ న్నారు. ఆగస్టు 15 తర్వాత హైదరా బాద్ మహానగర అభివృద్ధి కార్య క్రమాలపై దిశ‌ మానిటరింగ్ కమిటీ హైలెవల్ సమావేశం నిర్వహిస్తామ న్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎడ్యుకేషన్, మైనారిటీ వ్యవహారాలు, రైల్వేలు వంటి అంశాలపై చర్చించి(Discussing issues like GHMC, water works, education, minority affairs, railways, etc.), నత్తనడకన నడుస్తున్న పనులు వేగవంతం చేసేలా దిశ నిర్దేశం చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు.