–బిబీనగర్ ఎయిమ్స్ అనుబందం గా హైదరాబాద్ లో సెంటర్ ఏర్పా టు
–వైద్య విద్యార్దులకు శిక్షణ కోసం ఈ అదనపు కేంద్రం అవసరం
–రెండు ఎకరాల భూమి కేటాయిం చాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
–సీఎం రేవంత్ కు రాసిన లేఖలో కిషన్ రెడ్డి అప్పీల్
Kishan Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎయి మ్స్ బీబీనగర్ కు అనుబంధంగా హైదరాబాద్ అర్బన్ హెల్త్, ట్రైనిం గ్ సెంటర్ ను ఏర్పాటుకు వీలుగా రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిం చాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అలా గే తాత్కాలిక సెంటర్ ను నిర్వహిం చేందుకు వెంటనే ఏదైన ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శని వారం సిఎంకు ఒక లేఖ రాశారు.ఈ లేఖలో దేశ వ్యాప్తంగా ప్రజలకు మె రుగైన వైద్య సేవలను చేరువ చేయ డానికి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (Primary Health Centers) మొదలుకొని అన్ని స్థాయిలలో ఆరోగ్య కేంద్రాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు అత్యాధునిక వై ద్య సేవలను అందుబాటులో ఉంచ డానికి మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆ లేఖలో ప్రస్తావిం చారు.
అందులో భాగంగానే దేశం లోని అనేక రాష్ట్రాలలో ఎయిమ్స్ (aims) ఆసుపత్రులను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతోందని, అలాగే తెలం గాణ రాష్ట్రంలో కూడా 2019 లో బీబీనగర్ లో రూ. 1,300 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం మీకు తెలిసిందే అంటూ పేర్కొన్నారు.ఇకపోతే ప్రస్తుతం ఎయిమ్స్ బీబీనగర్ లో ఓపీడీ సేవలు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. ఎయిమ్స్ మెడికల్ కాలేజీని కూడా కొత్తగా ఏర్పాటు చేయడం, ప్రస్తుతం వైద్య కళాశాల తరగతులు కూడా ప్రారం భమయ్యాయి. ఎయిమ్స్ నూతన భవనాలు చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుచున్నవి. ఎయిమ్స్ బీబీనగర్ (bb nagar) హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన & శిక్షణ కార్యక్రమాలను, నగరంలో నివశిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉం టుం ది. దీనిని దృష్టిలో ఉంచుకుని స్థలాన్ని, తాత్కాలిక భవనాన్ని ఎయిమ్స్ కోసం కేటాయించాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.