Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kodandaram: రెచ్చగొట్టి మరీ రైతులతో ధర్నాలు

— ఎమ్మెల్సీ కోదండరాం ఆగ్రహం

Kodandaram: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వానికి చిప్ప చేతికిచ్చిన బిఆర్ఎస్, గత ప్రభుత్వందే బాధ్యత అని ఎమ్మెల్సీ కోదండరాం (Kodandaram) ఘాటు విమర్శలు చేశారు. రైతు లను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కోదం డరాం అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోదండరాం మీడి యాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి చిప్ప చేతిలో పెట్టి పోయిందని విమర్శిం చారు. రుణమాఫీ చాలామందికి అయిందని, కొన్ని టెక్నికల్ ఇబ్బం దులతో కొందరికి రుణమాఫీ కాలే దని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కట్టడాలకు గత ప్రభుత్వం పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటే బీఆర్ఎస్ (brs) నాయకుల వద్ద సమాధానం లేదని అన్నారు.

హైడ్రా విషయంలో (hydra)తమకి మినహాయింపు ఇవ్వమని బీఆర్ఎస్ నేతలు కోరడం విచిత్రంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం చెరువులను నాశనం చేసిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించలేదని అన్నారు. తనకు ఎమ్మెల్సీ రావడం ఉ ద్యమకారులకు ఇచ్చిన గుర్తింపుగా చూస్తున్నారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ (rajeev gandhi) ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పారు. రాజీవ్ విగ్రహం విషయంలో కత్తులు దుయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వంలో (KCR Govt) తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు అని బయటకి వచ్చేవాళ్లు నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం పెడుతామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. తాత్సారం చేయకుండా ఏకకాలంలో రుణమాఫీ చేయడం మంచి నిర్ణయమని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తే అభ్యతరం ఉండదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తే అభ్యంతరమా? అని అన్నారు. తెలంగాణలోనే రైతులకు ఇచ్చే రుణాలు తక్కువే అని చెప్పారు. జనాలకి దూరం అవుతానని సెక్యూరిటీ వద్దు అన్నానని కోదండరాం వెల్లడించారు. తనను లోక్ సభకు పోటీ చేయమని కేసీఆర్ అడిగారు. తాను నో చెప్పానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల (benifits)కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని కేసీఆర్ కే చెప్పానని, ఆయన పట్టించు కోలేదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని అన్నారు.