Komati Reddy : కోమటి రెడ్డి కి సీఎం గా ఆన్ని అర్హతలు
రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొ న్నారు.
వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందన్న ఉత్తమ్
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి (CM)అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొ న్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)భువనగి రిలో వెంకట్‌రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాని మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యా ఖ్యలు చేశారు.
కోమటిరెడ్డికి భవి ష్యత్తులో మంచి అవకాశాలు వస్తా యని స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి నామినేషన్ ర్యాలీలో ఉత్తమ్ మాట్లాడుతూ వెంకట్‌రెడ్డికి మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే అదే వేదికపై ఉన్న వెంకట్ రెడ్డి (Venkata Reddy)తనపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్య లపై స్పందించారు. తనకు ముఖ్య మంత్రి పదవిపై ఆశ లేదని, సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశా రు.
ఉత్తమ్ నా పట్ల అభిమానంతో అలా మాట్లాడారన్నారు. నన్ను నల్లగొండ (Nalgonda)ప్రజలు ఇన్నాళ్లుగా గెలిపిస్తూ చూపించిన అభిమానం చాలని, పదవులపై నాకు ఆశ లేదని, గతంలో తెలంగాణ కోసం 11రోజులు ఆమరణ దీక్ష చేసి మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. మంత్రిగా తాను నిర్వ రిస్తున్న పదవి నాకు చాలంటూ వ్యాఖ్యానించారు.
Komati reddy future CM of Telangana