Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, నాంపల్లి: మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మం డల కేంద్రంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను సందర్శించి సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిం చారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆద ర్శ పాఠశాలలోని తరగతి గదులన్నీ కలియతిరిగి ఎంతమంది విద్యార్థు లు విద్యార్థులు చదువుతున్నారు. హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారనే విషయాలకు సంబం ధించి ఆరా తీశారు.
ఆదర్శ పాఠశా లకు కిచెను డైనింగ్ హాలు లేకపోవ డంతో ఇబ్బందులు తలెత్తుతున్నా యని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని మం జూరు చేయించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆద ర్శ పాఠశాలలో పనిచేస్తున్న మహి ళ ఉపాధ్యాయురాళ్ళకు సన్మానం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివి స్తున్నారని చదువుతోపాటు సం స్కారాన్ని అలవర్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి మీ తల్లిదం డ్రుల పేరు ఈ ప్రాంత పేరు నిలబె ట్టాలని సూచించారు. విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు.