–మెడిసిన్ లో ఉత్తమ ర్యాంకు సా ధించిన పేద విద్యార్థిని
–ఆర్థిక ఇబ్బందులతో కూలి పనికి పోతున్న వైనం, చలించిపోయిన మంత్రి
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్ : మరో సారి గొప్ప మనసు చాటుకున్నా రు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) చదువుల తల్లికి అండగా ఉంటాని భరోసా ఇచ్చారు. ఎంబీబీఎస్ సీటో చ్చినా కూలీ పనులకు వెళ్తున్న వి ద్యార్థిని గురించి తెలుసుకుని చ లించిపోయారు. వెంటనే స్పందిం చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) చదువుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మెద క్ జిల్లా కౌడిపల్లి మండలం, సలాబ త్ పూర్ గ్రామానికి చెందిన కాట్రోజు సుమలత. మెడిసిన్లో ఉత్తమ ర్యాంక్ (RANK) సాధించింది. కుటుంబ పరిస్థితు లు తెలిసి చదివే సోమత లేక కూలీ పనికి వెళ్లోంది. వారి కుటుంబ ఆర్థి క ఇబ్బందుల గురించి తెలుసుకు న్న మంత్రి కోమటిరెడ్డి చలించిపో యారు.
వెంటనే వారిని పిలిపించు కుని మాట్లాడారు. ప్రతిభావంతురా లైన సుమలత చదువులకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డుగా మారకూడద న్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) తాను సుమలతకు అండగా ఉంటా నని హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, సుమలత, తండ్రి శివరాంకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ (Komatireddy Pratik Reddy Foundation) ద్వారా ఈ సంవత్సరం చదువు లకు కావల్సిన ఆర్థిక సహాయం అందించారు. పుస్తకాలు, బట్టలు ఇతర ఖర్చులకూ ఆర్ధిక సహాయం చేశారు. మంచిగా చదువుకొని డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయా లని ఆశీర్వదించా రు.. ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాని భరోసాకల్పిం చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందనతో సుమలత, తండ్రి శివరాం భావోద్వేగానికి గు రయ్యా రు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంతో అప్యాయంగా మాట్లాడారని, మే మేవరమో తెలియకపోయినా మా కష్టం తెలుసుకొన్నారు. మమ్మల్ని ఇంటికి పలిచి స్వీట్లు అందించి మర్యాద చేశారు. తన చదువులకు అండగా ఉంటానని చెప్పారని సుమలత భావోద్వేగానికి లోన య్యారు. ఇక, మెడికల్ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి కోమ టిరెడ్డి సుమలతకు కావల్సిన పుస్తకాలు, బట్టలకు అప్పటికప్పుడే ఆర్ధిక సహాయం (Financial assistance) చేశారు. చేయడమే కాదు ఐదేండ్లు ఆమె చదువుల బాధ్యత తీసుకుం టానని కోమటిరె డ్డి వెంకటర్ రెడ్డి తెలిపారు. మంత్రి సాయంపై సుమ లతతోపాటు ఆమె కుటుంబసభ్యు లు సంతోషం వ్యక్తం చేశారు. తన లాంటి ఎందరో పేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడు తున్న మంత్రి కోమటిరెడ్డికి సుమ లత కృతజ్ఞతలు తెలిపారు.