–యువరాజు కేటీఆర్ ను చూస్తే జాలేస్తోంది
–బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుం దనడం హాస్యాస్పదం
–నిబంధనలకు విరుద్ధంగా ఉంటే
జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చే స్తాం
–రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్ : బీఆ ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను చూస్తే జాలి వే స్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు. బుధవారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ నిబం ధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవనాలనే హైడ్రా కూల్చుతోందని గుర్తు చేస్తోంది. నిబంధనలకు విరు ద్ధంగా ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చివేస్తారని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేద న్నారు. అక్రమంగా జన్వాడలో కేటీ ఆర్ ఫామ్ హౌసు నిర్మించారని మం డిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ (BRS, BJP)రెం డూ ఒకటే అని, ఇక నుంచి బీఆర్ఎ స్ ను కూడా బీజేపీనే అని పిలవాల ని ఎద్దేవా చేశారు. అతి త్వరలోనే బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం కాబో తోందని తెలిపారు. వచ్చేసారి మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొ స్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ధర్నాకు వెయ్యి మంది కూడా రార ని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డికి ఎన్టీఎల్ పరిధిలో నిర్మా ణాలు ఉన్నాయనే విషయం తనకు తెలియదని, ఎందుకంటే ఆయన ఉండేది హైదరాబాద్ లోనని, ఆయ నకు ఇక్కడే ఇల్లు ఉందని చెప్పా రు.
ఎన్టీఎల్లో పొంగులేటికి (Pongulati in NT) నిర్మాణం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కోమ టిరెడ్డి తీవ్రంగా స్పందించారు. జ న్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ అ న్నారు. మీడియా వస్తే తాను తీసు కెళ్లి చూపిస్తానన్నారు. తాను కేటీఆ ర్ ఫామ్ హౌస్కు వెళ్లానని, అక్కడ ఆయన భార్య పనులు చేయిస్తోంద న్నారు. జన్వాడలో ముఖ్య మంత్రికి ఫామ్ హౌస్ లేదని చురక అంటిం చారు.ఒక మంచి ఆలోచనతో హై డ్రాను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సినిమా వాళ్ల ఇళ్లు, రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు, ఇలా అం దరివీ తొలగిస్తామన్నారు. తెలం గాణ ఏర్పాటు కోసం కేటీఆర్ ఒక్క లాఠీ దెబ్బ తిన్నారా అని నిలదీ శారు. తాము తెలంగాణ కోసం ఉద్య మించామని, కానీ కేసీఆర్ ఆసుపత్రిలో ఉద్యమం చేయలేద న్నారు. తాము రోడ్డెక్కి ఉద్య మిం చామన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహా న్ని తొలగిస్తామని కేటీఆర్ అనడం ఏమిటని మండిపడ్డారు. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే మరుక్షణమే బీఆర్ఎస్ కార్యాలయాలు, ఫామ్ హౌస్లు పునాదులతో సహా గాల్లో కలుస్తాయని హెచ్చరించారు. సిరి సిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజక వర్గాల్లోనే ఎంపీ ఎన్నికల్లో బీఆ ర్ఎస్ (brs)కు ఓట్లు భారీగా తగ్గాయని, అలాం టిది తాము అధికారంలోకి వస్తామని కేటీఆర్ అంటే నవ్వొస్తుం దన్నారు. కేటీఆర్ ను ఇక నుంచి బీజేపీ నేత కేటీఆర్ అనాలని ఎద్దే వా చేశారు. కుటుంబం కోసం బీఆ ర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చే స్తారని జోస్యం చెప్పారు.