–ఆయన గైర్హాజరుతో దిక్కుతోచని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
–మీడియా చిట్ చాట్ లో మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ మాజీ సీఎం కేసీఆర్ (kcr)అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం తో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA) దిక్కుతో చని స్థితిలో పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)వ్యాఖ్యానించారు. కేసీఆర్ సభ లో లేకపోవడంతో కిక్కు లేదని, ఆయన వస్తే మస్తు మజా ఉండే దన్నారు. ప్రతిపక్ష నేత లేక పోవ డంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరి స్థితి తల్లిలేని పిల్లల మాదిరిగా అయిందని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడి యాతో చిట్ చాట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy)ఇష్యూపై మాట్లాడుతూ మహిళ అని క్లెయిమ్ చేసుకుం టున్నప్పుడు పార్టీ మారి ఉండాల్సిం ది కాదన్నారు.
ఒకవేళ పార్టీ మారి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. ప్రతిపక్ష నేత హోదా హరీశ్, కేటీఆర్ లో ఎవ రికి ఇచ్చినా బీఆర్ఎస్ ఆగమైతద న్నారు. హరీశ్ రావు (Harish Rao)మంచి పనోడే కానీ ఆయనకు ఎల్వోపీ ఇవ్వరని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయా లు తీసుకున్న కేసీఆర్ సభలో లేన ప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే లు ఆయనను జాతిపిత అంటూ పొగిడి ఆకాశంలో కూర్చోబె ట్టారని, అధికారం పోయినా కేసీఆర్ ఇంకా అదే ఊహల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.