— టీయుడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి
Kompalli Srikanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమమమే ద్యేయంగా టీయుడబ్ల్యూజే(ఐజెయు) పని చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి , రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి (Kompalli Srikanth Reddy) పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ (Babu Jagjivan Ram Bhavan)లో సోమవారం టియుడబ్ల్యూజే రంగా రెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టు ఇంటి స్థలాల దరఖాస్తు పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం గత పది సంవత్సరాలుగా యూనియన్ అనేక పోరాటాలు చేసిందని అన్నా రు. ప్రస్తుతం ఇండ్ల స్థలాల కోసం చేపడుతున్నటువంటి విలేకరుల వివరాల సేకరణ అనంతరం నియో జకవర్గాల వారీగా లిస్టులను తయా రుచేసి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి (Chairman Srinivas Reddy)అందజేస్తామ ని స్పష్టం చేశారు. ఆయన నుంచి ప్రభుత్వానికి నివేదిక అందజేసేం దుకు రాష్ట్ర యూనియన్ నాయకు లు కృషి చేస్తున్నారని తెలిపారు. సంఘాల కతీతంగా నియోజక వర్గంలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల వివరాలను సేకరించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు అసలు ఎవరు కొసరు ఎవరు అనేది తేల్చాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. క్షేత్రస్థాయి లో పనిచేసే అర్హులైన జర్నలిస్టు లను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటి స్థలాలతో పాటు ఆరోగ్య భీమా (Health insurance) కల్పన తదితర అంశాలపై పెద్ద ఏత్తున కసరత్తు జరుగుతుంద ని అన్నారు .త్వరలో జిల్లా కేంద్రంగా రాష్ట్ర స్థాయి పాత్రికేయు ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మన సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాట్లు జరు గుతున్నాయని అన్నారు. ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయ వలసిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు కటకం సుభాష్జి, కోశాధికారి సంరెడ్డి శశి పాల్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, సోలిపురం రజనీకాంత్ రెడ్డి, వర్డెల్లి దశరథ, రచ్చ శేఖర్, శ్యాం ప్రసాద్, జంగయ్య, చెప్పల శ్రీనివాస్, మేకల రవీందర్ రెడ్డి, చెరుకు వెంకట్ స్వామి గౌడ్, మధు, రమేష్, శ్రీనివాసరావు, రాజు, మహేష్, మట్ట అశోక్ గౌడ్, రాజేంద్ర నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, సూర్య నారాయ ణ, ప్రేమ్ ,చందు, మహేష్ తది తరులు పాల్గొన్నారు.