Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Konda Surekha: ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు స్టేట్ గెజిట్ నోటిఫికేషన్

Konda Surekha: ప్రజా దీవెన, హైదరాబాద్: దేవాదాయ శాఖ భూముల పరిరక్షణలో భాగంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ (State Gazette Notification) ఇస్తున్నామని దేవా దాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. రాష్ట్రం లోని పలు ఆలయాల అభివృద్ధి వివరాలు, భక్తులకు కల్పిస్తున్న వసతుల వివరాలు, దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చేప డుతున్న చర్యల వివరాలు తెలుపుతూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ దేవాదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతు న్నామని వివరించారు. దేవాదాయ భూములను సర్వే చేసి సైన్ బోర్డులు (Sign boards) ఏర్పాటు చేయడంతో పాటు 34 వేల 92 ఎకరాల దేవా దాయ భూములకు జియో ట్యా గింగ్ చేయడం జరిగిందని అన్నా రు. 57 శాతం దేవాదాయ భూము లను ధరణిలో నిక్షిప్తం చేయడంతో పాటు ఇతరలు ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేకుండా చర్యలు తీసుకున్నమ న్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ ఆల యాల అభివృద్ధికి చర్యలు తీసు కుంటున్నామని అన్నారు. రాబో యే బ్రహ్మోత్సవాల నాటికి యాదగి రి గుట్ట దేవాలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం చేస్తు న్నామన్నారు. దాతల చే సేకరించి న 15 కోట్ల విరాలాలతో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీనివలన రోజుకు సూమారు 2500 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందించే వీలు కలుగుతుందని అన్నారు. అదే విధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలినడక భక్తులకు ఎండ నుండి ఉపశమనం కల్పించేందుకు షెడ్ల నిర్మాణం (Construction of sheds) చేపట్టామన్నారు. దక్షిణ అయో ధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగం గా భూ సేకరణ చేసెందుకు 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

వీటితో పాటు వేములవాడ, భాసర వంటి ప్రముఖ ఆలయాల అభివ ద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొం దించడం జరిగిందన్నారు. భవి ష్యత్తులో అన్ని దేవాలయాల వెబ్ సైట్ లను ఒకే గొడుగుకిందకు తీసుకు వచ్చి దేవాదాయ శాఖ సమగ్ర వెబ్ సైట్ ను తయారు చేయబోతున్నామన్నారు. త్వరలో దేవాదాయ శాఖ యాప్ (Debt Department App)ను ఏర్పాటు చేయడంతో పాటు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా భక్తులు తమకు ఇష్టం వచ్చిన దేవాలయాల వివరాలు స్థల పురాణాలు తెలుసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా గత 15 సంవత్సరాలుగా బదిలీలు లేకుండా ఒకే చోట పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ భారీగా భదిలీలు చేపట్టమన్నారు. దేవాదాయ శాఖలోనే (Dēvādāya śākha) ఇది రికార్డు అన్నారు. ప్రెసిడెన్,యల్ ఆర్డర్ 2018 వచ్చిన తర్వాత జోనల్ సిస్టమ్ ప్రకారం సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరించుకున్నామని అన్నారు. చాలా రోజులగా దేవా దాయ శాఖలో ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించామని తెలి పారు.