–మహిళ కమిషన్ కార్యాలయం వద్ద గందరగోళం
— మహిళా కమిషన్ వద్ద గతంలో ఇచ్చిన వ్యాఖ్యలపై వివరణ
–మహిళా కమిషన్ వద్ద కూడా రాజకీయాలేనా
–వివరణ ఇచ్చేందుకు వస్తే అడ్డు కుంటారా
–కాంగ్రెస్ కు చెందిన మహిళలు ధర్నాలు చేస్తారా
–కమిషన్ కార్యాలయం వద్ద ఘటనలపై కెటిఆర్ అగ్రహం
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: వ్యవస్థలను గౌరవించి తాను వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ వద్దకు వస్తే కాంగ్రెస్ నేతలు దానిని కూడా రాజకీయం చేసే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ (ktr)కమిషన్ ఎదుటే బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ లీడర్లు (Congress leaders against BRS women leaders and activists)దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చేందుకు శనివారం కమిషన్ ఎదుట హాజ రయ్యారు. చైర్ పర్సన్ కు వివరణ ఇచ్చిన అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడుతూ,బిఆర్ఎస్ నేతలపైనా, మహిళలపైనా కార్యాల యం వద్ద దాడులు చేయడం రాజకీయాల్లో ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.
తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణ చెప్పినట్లు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఇవాళ కమిషన్ ఎదుట కూడా చెప్పానని అన్నారు. బీఆర్ఎస్ (brs)నేతలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.అంతకు ముందు పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి బయల్దేరిన కేటీఆర్ ట్యాంక్‌బండ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాల యానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్‌ను (ktr) మాత్రమే ఆఫీస్‌లోకి అనుమతించిన పోలీసులు బీఆ ర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, నాయ కులను అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదే సమయంలో కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేస్తూ.. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత (Mahila Congress state president Sunitha), నేతలు బుద్ధభవన్ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా లోకాన్ని ఆయ న అవమానించారని విమర్శించా రు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. పోటాపోటీ ఆందోళనలతో కార్యాల యం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారా స, కాంగ్రెస్ మహిళా నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసు కున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు శ్రమించా ల్సి వచ్చింది.కాగా , విచారణకు హాజరైన కెటిఆర్ కు మహిళా కమి ష న్ లోని పలువురు సభ్యులు ఆయనకు రాఖీలు కట్టారు.