Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: సీఎం రేవంత్ వ్యాఖ్యల్లో అస్పష్టత

–ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ

KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో రైతు రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) లేఖ రాశారు. రూ.40వేల కోట్లు రుణమా ఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్తు న్నారని, కానీ రూ.17వేల కోట్లు మా త్రమే మాఫీ చేసినట్లు కేటీఆర్ KTR)లేఖ లో పేర్కొన్నారు. సీఎం మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు మధ్య స్పష్టమైన తేడా ఉన్నట్లు ఆయన చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ అంటూ వారిని నట్టేట ముంచారని ఆగ్రహించారు. వరంగల్ రైతు డిక్ల రేషన్ ప్రకారం రైతులకు ఇచ్చిన మాటను రాహుల్ గాంధీ నిలబె ట్టుకోవాలని అన్నారు.వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే..

ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ (Farmer’s Declaration)పేరిట రూ.2లక్షలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు అందరికీ మాఫీ అమలు చేయాల్సి ఉండగా.. అనేక షరతులు పెట్టి కేవలం 40 శాతం మందికి మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది అన్నదాతల తరఫున లేఖ రాస్తు న్నట్లు ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. వేల కోట్లు రైతులకు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అనేక షరతులు పెట్టి అన్నదాతల ఖాతాల్లో నగదు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. సీఎం మాటలకి క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.

కచ్చితంగా వరంగల్ డిక్లరేషన్ (Warangal Declaration)అమలు చేయాల్సిందే అని లేఖలో డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని లక్షల మంది రైతన్నలు రాష్ట్రవ్యా ప్తంగా రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని, వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాటకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కట్టుబడి అర్హులైన అన్నదాతలందరికీ మాఫీ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. లేకుండా బాధితుల తర ఫున కాంగ్రెస్ పార్టీకి వ్యతి రేకంగా పోరాటం ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) హెచ్చరించారు.