–దేశంలోనే అతి పెద్ద మోసం కాంగ్రె స్ ప్రభుత్వ రైతు రుణమాఫీ
–అప్పులు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు
–ఒకే సంతకంతో డిసెంబర్ 9న రు ణమాఫీ చేస్తామని మాట తప్పారు
— మీడియా సమావేశంలో బిఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నే అతి పెద్ద మోసం కాంగ్రెస్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీ రామారావు (KTR) విమర్శించారు. రుణమాఫీ పేరుతో చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేం దుకు రేవంత్ రెడ్డి రంకెలు వేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అప్పు లు తీసుకున్న రైతుల్లో సగం మంది కి కూడా రుణ మాఫీ కాలేదని తెలిపారు. ఒకేసంత కంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పా రని విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాదులో మీడియా సమా వేశంలో మాట్లాడారు. తొలుత రూ.40 వేల కోట్లతో మాఫీ అంచ నాలు వేసి ఇప్పుడు కేవలం రూ. 27 వేల కోట్ల కే పరిమితం చేయ డమేoటని కేటీ ఆర్ ప్రశ్నించారు. జులై రాగానే లబ్ధి దారుల్లో సగానికిపైగా రైతులకు కోత విధించి మాఫీ అమలు చేశార ని అన్నారు.31వేల కోట్లు రుణమా ఫీ అని కేబినెట్ తీర్మానం చేశారు. అమలులో ఆంక్షలు, కోతలు పెట్టా రు.
సీఎం అంటే కటింగ్ మాస్టర్ (Cutting master)అన్నట్లుగా రేవంత్ పరిస్థితి ఉంది. 60శాతం రైతులకు ఎగ్గొట్టి 40శాతం రుణమాఫీ చేసి వంద శాతం చేశా మని చెబుతున్నారు. అంకెలు మా ర్చి రంకెలు వేస్తున్నారు. కేసీఆర్‌పై ద్వేషం సకల జనులకు మోసం ఇది రేవంత్ విధానం. నిన్నటి వరకు 17, 934 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. 22 లక్షల 37 వేల 840 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడూ రుణమాఫీ చేశాం, రైతు బంధు ఇచ్చాం. ఆ రెండు పథకాలకుగానూ మా ప్రభుత్వం రైతుల కోసం రూ.లక్ష కోట్లు వెచ్చిం చింది. కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 17వేల కోట్లే వానా కాలానికి ఇవ్వా ల్సిన రైతు బంధు ఇవ్వలేదు. రేవం త్ సోదరుడు కొండల్ రెడ్డి పర్యటన సక్సస్ అయింది. రేవంత్ (Revanth) పర్యటన విజయవంతం కాలేదు. ఆ కోపంతో నే రేవంత్ రంకెలు వేస్తున్నట్లు ఉంద ని కేటీఆర్ పేర్కొన్నారు.
అన్నదాతలనే అడుగుదాం పదా.. సీఎం రేవంత్ రెడ్డి భద్రత లేకుండా కొడంగల్ నియోజక వర్గా నికి రావాలని, నేనూ వస్తానని ఒక్క గ్రామంలోనైనా వంద శాతం రుణ మాఫీ జరిగిందని రైతులు చెబితే అక్కడే నేను రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. దమ్ముంటే నా సవాల్‌ని స్వీకరిం చాలని, రుణమాఫీ (Loan waiver)పూర్తిగా చేయ కుండానే సంపూర్ణంగా మాఫీ చేశా మని చెప్పడం దిగజారుడుతనం అని ధ్వజమెత్తారు.
రైతులను మో సం చేసిన సీఎంపై చీటింగ్ కేసు (Cheating case against CM)పెట్టాలని, రేవంత్ మానసిక స్థితిపై నాకు అనుమానం ఉందని వ్యాఖ్యా నించారు. ఆయనకు ఏదో అయిన ట్టుంది, ఆయన్ను ఎక్కడైనా చూ పించాలని వారి కుటుంబ సభ్యు లకు విన్నవిస్తున్నా రుణమాఫీ, ఆ రు గ్యారంటీలు అమలు చేయాలని హరీష్ రావు అన్నారు. రాజీనామా చేయాలని కొందరు సన్నాసులు హరీష్ ఫ్లెక్సీలు పెట్టారు. 8 నెలల్లో 19సార్లు ఢిల్లీకి వెళ్లడం రేవంత్ రికార్డు అయితే కేసీఆర్ పదేళ్ల కా లం లో కూడా 19సార్లు ఢిల్లీకి వెళ్ల లేదని, ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే ఇంకా లక్షమంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తు న్నారన్నారు. సీఎం జిల్లాలో 41 శాతం, డిప్యూటీ సీఎం జిల్లాలో 30 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిం దని, గ్రామాల్లో పర్యటించి వివరా లు సేకరిస్తమని, ప్రభుత్వానికి, గవ ర్నర్ (To Govt., Govt) వివరాలు ఇస్తామని, అవసర మైతే కోర్టుకు వెళతామని కేటీఆర్ అన్నారు.