Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: ప్రజా పాలన అంటే ఇదేనా..!

–దోమల మందుకూ నిధులు లేవని చెప్పడం సిగ్గుచేటు
–పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నం
–గ్రామాల్లో జన జీవనం దినదిన గండంలా మారింది
–ఉపాధి హామీ, హెల్త్ మిష‌న్ ఫండ్స్ దారి మళ్లించారు
— ఆ రూ. 2100 కోట్లు ఏమయ్యా యో ప్రజలకు చెప్పాలి
— రేవంత్ సర్కారు వ్యవహారశైలి పై కేటీఆర్ విమ‌ర్శ‌లు

KTR:ప్రజా దీవెన, హైదరాబాద్​ : కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు (Villages and towns) కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిప‌డ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, మరోవైపు పట్టణాల్లో అధ్వాన్న పరిస్థితి నెలకొందని ప్ర‌జా పాల‌న అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌ట‌మేనా అని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించారు.అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపో వడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతు న్నాయ‌ని కేటీఆర్ (ktr) అన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింద‌న్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింద‌న్నారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తు న్నాయ‌ని పేర్కొన్నారు. పంచాయ తీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా మీ ప్రజాపాలన అంటే అని కేటీఆర్ (ktr)నిల‌దీశారు.

సర్పంచ్‌లపై నిర్బంధాలు….
బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు (Panchayats) టంచన్‌గా రూ. 275 కోట్లు విడుదల చేశామని, నేడు పెండింగ్ బిల్లులు చెల్లించా లని అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచ్‌లపై (Ex-Sarpanches)నిర్బం ధాలు అక్రమ అరెస్టులు చేశారని కేటీఆర్​ మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన ₹500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని నిలదీశారు. ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ. 2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారన్నారు. 12,769 పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ. 4305 కోట్లుగా ఉంటాయని అంచనా ఉందన్నారు. మరి వాటి పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్ర‌శ్నించారు.