KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరి సిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెం ట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆది వారం మీడియాతో మాట్లాడిన ఆ యన రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదవిని ఊడబీ కటానికి మంత్రి పొంగులేటి శ్రీనివా స రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు. భార్య సోదరుడు బావ మరిది కాకుండా ఏమవుతారని ప్ర శ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తర చుగా చెప్తున్న ఫోర్త్ సిటీ కాదని ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు.
పదేళ్లు ప్రభుత్వాన్ని (Ten years of government) నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా అని అ న్నారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా సీ ఎం కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తామని కేటీఆర్ అన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికి పోయానని సీఎంకు కూడా తెలు సునని అన్నారు. చట్టాలే కాదు చు ట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కేటీఆర్ విమ ర్శించారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి (ponguleti) తన తో కలిసి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.తప్పు జరగలేదంటే రాజ కీయ సన్యాసం తీసుకుంటా అని శపథం పునారు. టెండర్లలో తప్పు లే మీ జరగలేదంటే రాజకీయ స న్యాసం తీసుకుంటాన ని కేటీఆర్ సవాల్ విసిరారు. సీజే దగ్గరకు రావడం ఇష్టం లేదంటే ఢిల్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకైనా రావా లన్నారు. సీఎం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని టెండర్లు రద్దు చేయాల ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫిరా యింపులపై సీఎం, మంత్రులు న్యా యవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తు న్నారని ఆరోపించారు.
సింగరేణి కార్మికులకు వాటా పెంచాలి.. కాంగ్రెస్, బీజేపీ కలసి సింగరేణిని ప్రైవేటీకరించాలని ప్ర యత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరో పించారు. సింగరేణి వ్యవ హారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించా లని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఆధ్వరంలో జరిగిన వేలంపాటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నవ్వుతూ వెళ్ళి మద్దతు తెలిపా రని గుర్తు చేశారు. సింగరేణి లాభా ల్లో కార్మికుల వాటాను ప్రభుత్వం తగ్గించిందని ఆరోపించారు. లాభా ల్లో వాటాను 33శాతం కాకుండా 16.9శాతమే పంచుతున్నారని అ న్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షా 90వేలు కాదని రూ. 3లక్షల 70వేలు బోనస్‌గా ఇవ్వాలని కేటీ ఆర్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల వాటా తగ్గింపుపై గుర్తిం పు సంఘం ఏఐటీయూసీ స్పందిం చాలన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయం చెప్పాలని కేటీఆర్ (ktr)డిమాండ్ చేశారు. వాటా పెంచాలని కార్మి కులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలసి ఒత్తిడి చేయాలని సూచించారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.