KTR: గత చేదు జ్ఞాపకాలకు కారకులెవరు కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడు కలు జరగనున్న నేపథ్యంలో అధి కార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల తూటా లు చిలికి చిలికి గాలు వానలా మారుతున్నాయి.
పలు ప్రశ్నలు సంధించిన బి ఆర్ ఎస్
సిటీ కాలేజీ వద్ద కాల్పుల్లో మర ణించిన విద్యార్ధుల త్యాగాలకు ప్రతిరూపమే అమరవీరుల స్థూపం
తెలంగాణ మలి ఉద్యమంలో 37 0 మందిని కాల్చి చంపిది మీరే కదా
సోనియాను బలిదేవతగా అభివ ర్ణించింది రేవంత్ అంటూ సెటైర్లు
ట్విట్టర్‌లో పలు అంశాలపై కాంగ్రెస్‌ని నిలదీసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడు కలు జరగనున్న నేపథ్యంలో అధి కార కాంగ్రెస్,(Congress) ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) మధ్య మాటల తూటా లు చిలికి చిలికి గాలు వానలా మారుతున్నాయి. తెలంగాణ లోగో మార్పు, గీతంపై ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్(KTR) కాంగ్రెస్ పై ట్డిట్టర్ (ఎక్స్)లో ప్రశ్న ల వర్షం కురిపించారు. తెలంగాణా(Telangana) లో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు అన్ని ప్రశ్నించి.. దీనికి జవాబు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అంటూ నిలదీశారు.
1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు, కాంగ్రెస్ ప్రబుత్వం కాదా ..1971 లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections)11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు.దేశంలో ఎక్క డలేని విధంగా ప్రజా స్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలం గాణను తుంగలో తొక్కింది ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)కదా… 2004లో మాట ఇచ్చి, పదే ళ్లు తాత్సారం చేసి వందలాది తెలం గాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అన్నారు. రేవంత్ రెడ్డి స్వ యంగా చెప్పినట్టు, వేలాది తెలం గాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరు సోనియా గాంధీ కాదా ఈ మాట అప్పుడు రేవంత్ రెడ్డినోటి నుంచి వచ్చిన ఆణిముత్యం కాదా అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
KTR tweet congress telangana movement