–అంతా అబద్ధపు అవాస్తవ ప్రచారాలు
–తెలంగాణలో హాట్ హాట్ రాజకీయాలు
–ఈ కార్ రేస్ కేసుపై సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహావేశాలు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గడిచిన ఏడాది కాలంగా రాజకీయాలు హాట్ హాట్ గా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తరుణంలో తాజాగా మరో రణరంగo తెరపైకొచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమో దుకావడంతో ఈ తాజా రాజకీయ రణక్షేత్రం యుద్ధానికి సన్నద్ధమవు తున్నట్టు సంకేతాలు అందుతున్నా యి. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీ బి ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏవన్‌గా నిర్ధారించడoతో అసలు వాదనలు ప్రతి వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా పరస్పరం విమ ర్శలు, ప్రతివిమర్శలతో గుప్పించు కుంటున్నాయి.ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌పై కేసు నమోదు కావడo తెలంగాణ రాజకీ యాల్లో మంటలు చెలరేగుతున్నా యి. ఈ అంశంపై పాలక ప్రతిపక్షా లు ఎవరివాదన వారిదే అన్నట్టుగా సమర్ధించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ కార్ రేస్ కేసు పై పూర్తిస్థాయి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే హైదరా బాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వ హించామని కేటీఆర్ వెల్లడిం చారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై తప్పు డు కేసు నమోదు చేసినట్లు ఆరో పించారు.2001లోనే హైదరాబాద్ లో ఫార్ములా-1 రేస్ పెట్టాలని అప్ప టి చంద్రబాబు ప్రభుత్వం ప్రయ త్నించిందని కేటీఆర్ తెలిపారు. కానీ మారిన రాజకీయ పరిణా మాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించామని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు శాసనస భలో అనుమతించాలని స్పీకర్‌ను కోరామన్నారు.
ఫార్ములా-ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వా నికి లేదని ఎద్దేవా చేశారు. అక్రమా లు నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసు పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమె త్తారు.హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్ నిర్వహించడంపై సచిన్, ఆనంద్ మహీంద్రా వంటి ప్రము ఖులతో పాటు బీజేపీ కేంద్ర మంత్రు లు ప్రశంసించారని కేటీఆర్ గుర్తు చేశారు. కారు రేస్ నిర్వాహకులకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు చెల్లిం చిందని వెల్లడించిన కేటీఆర్, ఇది వాస్తవమని నిర్వాహకులు అంగీ కరిస్తున్నారని, ఇందులో అవినీతి జరిగింది ఎక్కడో వివరణ ఇవ్వాల న్నారు. రేసింగ్ రద్దయినందున లైసెన్స్ ఫీజు రూ.74లక్షలు వాపస్ తీసుకోవాలని ఎంఫ్‌ఎంఎస్‌ఏ వాళ్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పం దించడం లేదని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఎ లాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటా మని కేటీఆర్ తెలిపారు. రాజకీయ కేసు రాజకీయంగానే కొట్లాడుతా మని కేటీఆర్ స్పష్టం చేశారు. మరో వైపు, మీడియా ప్రతినిధులు అడిగి న ప్రశ్నకు సమాధానంగా ఒఆర్ ఆర్ టెండర్‌పై ప్రభుత్వం సిట్ విచా రణకు ఆదేశించడంపై కేటీఆర్ స్పం దించారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ORR టెండర్ రద్దు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.