కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైన పండగని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజి అధ్యక్షుడు కుంభం కృష్ణారెడ్డి అన్నారు. ఆయన నాంపల్లి మండలం అభివృద్ధి కార్యక్రమాలు పర్యటనలో భాగంగా నాంపల్లి పట్టణ కేంద్రంలోని ఎదుల్ల గోపాల్ కుమారులు యాదగిరి కోటేష్ నూతన గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై క్రైస్తవులు ఏర్పాటుచేసిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని తెలిపారు ప్రేమను పంచడం మంచి మనసుతో సేవ చేయడం ఎలాగో క్రీస్తు బోధనలు తెలుపుతాయని అన్నారు. నాంపల్లి మండల ప్రజలు క్రిస్మస్ పండుగ ను ఘనంగా జరుపుకోవాలని ప్రజలు ఆనందంగా జీవించాలని ఏసుక్రీ స్తు దీవెనలు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని పాస్టర్లు పాల్గొని ప్రార్థనలు చేశారు పాస్టర్లు పెరుమాండ్ల దాసు పేతురు గాదెపాక పుష్ప జాకోబ్. నాంపల్లి పట్టణ మాజీ వార్డు మెంబర్లు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గుండెబోయిన సత్తయ్య పంగ కొండయ్య తదితరులు పాల్గొన్నారు