Lingam Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: రవీంద్ర భారతిలో జరిగిన సావిత్రి భాయి భాయి ఫూలే 194వ జయం తి వేడుకల్లో బీసీ ఉద్యమ నేత లిం గంగౌడ్ పాల్గొన్నారు. భారతదే శంలో మహిళలు చదువుకోవాలని తన జీవితాన్నే త్యాగం చేసి కోసం అనేక అవమానాలను భరించి వారు ఎదుగుదలకు అనేక రకాలు గా ప్రోత్సహించిన సంఘసంస్కర్త మొట్టమొదటి మహిళా ఉపాధ్యా యురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె సేవలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ కొనియాడారు.
ఆమె 194వ జయంతి సందర్భంగా రవీం ద్ర భారతిలో జరిగిన కార్యక్రమoల్లో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు , అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో పీడి త ప్రజల పక్షాన నిలిచిన జ్యోతిబా పూలే పూలే అడుగుజాడల్లో నడు స్తు ఆనాటి బ్రహ్మనీయ కోణానికి వ్యతిరేకంగా పోరాడి, దళిత బహు జన బడుగుల కోసం వారు చదు వుల కోసం కొట్లాడి, ఆమె వాళ్లకు చదువులు చెప్పారని వారు అన్నా రు.
ఈ రోజుల్లో కూడా మహి ళలు అనేక ఆటుపోట్ల గురవుతున్నారని వారందరూ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని, ఎక్కడైతే అణిచివేత గురైనారో అక్కడ చదు వుతూ సమాధానం చెప్పాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బూర శ్రీనివాస్, తెలంగాణ కల్లుగీత వృత్తిదారుల సంఘం కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ , ఆనంతుల సాయి రవి తదితరులు పాల్గొ న్నారు.