Lingum Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీ పోలీస్ అధికారులకు ఎస్సై స్థాయి నుండి ఐపీఎస్ స్థాయి వరకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారికి ప్రాదాన్యత గల పోస్టుల్లో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.ఈ సందర్బం గా లింగంగౌడ్ మాట్లాడుతూ అన్ని అర్హతలు,సిన్సియారిటీ సీనియారి టీ ఉన్న పదోన్నతులు పోస్టింగ్ విష యాలలో బీసీ పోలిస్ అధికారు లకు తీవ్ర అన్యాయం జరుగుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. కేవ లం లాబీయింగ్ చేసే వారికి రాజకీ య పలుకుబడి ఉన్న కొంతమంది రెండు కులాలకు మాత్రమే ప్రాధా న్యతను ఇస్తున్నారు.
మెజార్టీగా ఉన్న బీసీలకు ఈ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని,ఎంతో ప్రతిభ ఉన్న బీసీ పోలీస్ అధికారు లకు లూప్ లైన్లో లేదా విఆర్ లో ఉంచుతున్నారని దయచేసి వారికి ప్రాదనతగల పోస్టులో అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్య క్షుడు బూర శ్రీనివాస్ గౌడ్ , గోదా రవి తదితరులు పాల్గొన్నారు.