Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponnam Prabhakar Goud: ప్రకృతి వైపరిత్యాలతో ప్రాణనష్టాన్ని అరికట్టాలి

వరదలు, వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగొద్దని, ఎంత ఖర్చయినా సత్వర చర్యలు చేపట్టాలని, అవసరమైతే అధికా రులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ చార్జి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ ఆదేశించారు.

ఎంత ఖర్చయినా కాని ప్రజల ప్రాణలను కాపాడాలి
వరదల వల్ల ఇబ్బందులు పడకుం డా చూడాల్సిన బాధ్యత అందరిదీ
సీజనల్‌ వ్యాధుల నిరోధానికి పక్కా ముందస్తు జాగ్రత్తచర్యలు
నాలాల్లో వ్యర్థాలను ఎప్పటిక ప్పుడు తొలగిస్తూనే ఉండాలి
అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాలు

ప్రజా దీవెన హైదరాబాద్: వరదలు, వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగొద్దని, ఎంత ఖర్చయినా సత్వర చర్యలు చేపట్టాలని, అవసరమైతే అధికా రులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ చార్జి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్(Transport Minister Ponnam Prabhakar Goud)ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని, హైద రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడాలని కోరారు.

బుధవారం జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో వర్షాకాల సన్నద్ధత, పారిశుధ్య నిర్వహణ, ఆహార కల్తీ, బక్రీద్‌ ఏర్పాట్లపై మే యర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి సమీక్షించారు. అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడుతూ వరద నీటి నిర్వహణతోపాటు డెంగీ, మలే రియా వంటి సీజనల్‌ వ్యాధులు(Seasonal diseases)ప్రబలకుండా చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. భారీగా వర్షపు నీరు నిలుస్తున్న 12 ప్రాంతాల్లో భూగర్భ సంపులు నిర్మి స్తున్నామని, వాన పడినప్పుడు వాటిలో నిలిచే నీటిని మోటార్ల ద్వా రా బయటకు పంపుతామని చెప్పా రు.

విపత్తు నిర్వహణకు సంబంధిం చి 5 వేల మంది కానిస్టేబుళ్లకు శిక్ష ణ ఇచ్చామని గుర్తు చేశారు. వరద నీటి నిర్వహణకు మూడు షిఫ్టుల్లో 24 గంటలు ప్రత్యేక బృందాలు పని చేస్తాయని, ప్రాంతాల వారీగా 203 మంది నోడల్‌ అధికారులను వరద నీటి నిర్వహణ కోసం నియమించి నట్టు చెప్పారు. నాలాల్లో వ్యర్థాల పూడికతీతపై(Dumping of waste in canals)ప్రస్తుతం సాంకేతిక పర్యవేక్షణ కొనసాగుతోందని, అక్ర మాలు జరిగినట్టు సర్కారు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. మాంస వ్యర్థాల నిర్వ హణతో ఆదాయం పెంచుకునేందు కు ప్రణాళిక రూపొందించాలని అధి కారులను ఆదేశించారు. బక్రీద్‌ పండుగకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమా వేశంలో కమిషనర్‌ ఆమ్రపాలి ఇం జనీర్‌ ఇన్‌ చీఫ్‌ జియావుద్దీన్‌, చీఫ్‌ సిటీ ప్లానర్‌ రాజేంద్ర ప్రసాద్‌ నాయ క్‌(Chief City Planner Rajendra Prasad Nayak), అదనపు, జోనల్‌ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Loss of life natural calamities prevented