–త్వరలో సీఎల్పీలో బీఆర్‌ఎస్
ఎమ్మెల్యేల విలీనం
–మీడియా సమావేశంలో మధుయాష్కీ గౌడ్
Madhuyashki Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: ఫిరా యింపులపై మాట్లాడే అర్హత కేటీ ఆర్‌కు ఉందా అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud)ప్రశ్నిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) లను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న ప్పుడు ఆయన నీతి ఏమైందని ప్రశ్నించారు. మంగళవారం తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో ప్రతిపక్ష పార్టీలను చీల్చి, రాజకీ యాల్లో విలువలను దిగజార్చిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది రోజులు గడవక ముందే ప్రభుత్వం కూలి పోతుందంటూ కేసీఆర్, కేటీఆర్ బెదిరింపు మాటల కారణంగానే తమ పార్టీలో చేరేందుకు వస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను (BRS MLAs) ఆహ్వా నించాల్సి వస్తోందన్నారు. త్వరలో నే సీఎల్పీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల విలీనం ఖాయమని ఆయన చెప్పా రు.
అధికారంలో ఉన్నప్పుడు యువ రాజుగా ఉన్న కేటీఆర్ (ktr)అధి కారం పోయాక తికమకగా మాట్లా డుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అసలు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిం ది బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలేనని (BJP and BRS are not parties) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ (kcr)కుటుంబంపై విరక్తి చెందే స్వేచ్ఛ కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అ న్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షను లక్ష లాది మంది రాస్తున్నారని, 5 వేల మంది కోసం ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చడం కుదరదు కదా అని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాల నలో నిరుద్యోగులకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు కాంగ్రె స్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ హయాంలో 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే తమ ప్రభుత్వం ఆ పోస్టులను 11062కి పెంచి మెగా డీఎస్సీ ప్రక టించిందని పేర్కొన్నారు. నిరుద్యో గుల ముసుగులో కేటీఆర్ (ktr)చేస్తున్న చిల్లర రాజకీయాలను ఇప్పటికైనా ఆపాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు.