–పిసిసి అధ్యక్షులు మహేష్ కుమా ర్ గౌడ్ కు జాజుల వినతి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న నామినేటెడ్ పదవు లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పాలన విభాగాలలో బీసీలకు జనా భా దామాషా ప్రకారం 50% వాటా కల్పించాదానికి ఈ అసెంబ్లీ సమా వేశాల్లోనే ప్రత్యేకంగా చట్టం తీసు కురావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. శనివారం హైదరాబాదులోని పిసిసి అధ్య క్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ క్యాంప్ కార్యాలయంలో బీసీ ప్రతి నిధుల బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జా జుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రివర్గం లో, నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పరిపాలన విభాగాలలో మీ అధికారిక పోస్టుల్లో బీసీలకు జనా భా ప్రకారం వాట కల్పించడం లేద ని, ఒకటి, రెండు సామాజిక వర్గా లకు పెద్ద పీట వేస్తూ మెజార్టీగా ఉన్న బీసీలను విస్మరిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వం నియ మించే నామినేటెడ్ పోస్టుల్లో బీసీ లకు 50 శాతం తప్పనిసరిగా ఉండే లా ప్రస్తుతం జరిగే అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన డిమాం డ్ చేశారు అలాగే సమగ్ర కులగన నలో నేటి వరకు పాల్గొనలేక పోయిన వారికి మళ్లీ అవకాశం కల్పించడానికి ప్రత్యేకంగా వారo రోజులపాటు స్పెషల్ డ్రైవ్ ని ర్వహించాలని ఆయన కోరారు హైదరాబాదు లాంటి మహానగ రంలో నేటి వరకు సంపూర్ణంగా సమగ్ర కులగనన సర్వే జరగలేదని ఇలాంటి సమయంలో వందకు వందశాతం సమగ్ర కులగణన్న జరగాలంటే తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సంపూర్ణంగా సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని జాజుల కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరా జు నాయకులు తాటికొండ విక్రమ్, ఐలి వెంకన్న, ఎలికట్టే విజయ్ కుమార్, ఇంద్ర రజక, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.