Mahesh Kumar Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీ నేత లింగంగౌడ్ రూపొందించిన బీసీ సంక్షేమ సంఘం నూతన కాల మానిని పీసీసీ అ ధ్యక్షుడు మహే శ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మట్లాడుతూ బీసీలకు నిజమైన న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్య మని అన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహి స్తామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మట్లాడుతూ ఈ నూ తన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్క రూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్య క్రమంలో ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి,తెలంగాణ విద్యార్థి యువ జన పరిషత్ రాష్ట్ర అధ్య క్షుడు బూర శ్రీనివాస్ అనంతుల సాయి బండి గారి భరత్ రవి, గుంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు