— బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Maheshwar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంట్రాక్టుల పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంట్రా క్టర్ మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్ర సంప ద దోచి పెడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy)ఆరోపిం చారు. నాసిరకం పనులు చేస్తుం దంటూ మేఘా కంపెనీకి కేంద్ర ప్రభు త్వం షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయి 10రోజులు గడిచినా కాంగ్రెస్ ప్రభు త్వం దృష్టికి రాలేదా అంటూ ఆయ న మండిపడ్డారు. సుంకిశాల పను లు మేఘా కంపెనీయే చేసిందని, అలాంటిది కొడంగల్‌లో చేయబోతే పనులను సైతం ముఖ్యమంత్రి అదే కంపెనీకి ఇవ్వబోతున్నట్లు మహే శ్వర్ రెడ్డి మండి పడ్డారు.తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయం లో మేఘా కృష్ణారెడ్డిపై సీఎం రేవం త్ రెడ్డి సీబీఐకి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడేమో క్రిమినల్ కాంట్రాక్టర్ (Criminal contractor) మేఘా కృష్ణారెడ్డికే సీఎం దోచిపె డుతున్నారంటూ సంచలన ఆరోప ణలు చేశారు. తెలంగాణలో గొర్రెల ను తినేటోడు పోయి.. బర్రెలను తినేటోడు వచ్చాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (kcr) దోచుకున్న అవినీతి సొమ్ములో రేవంత్ రెడ్డి వాటా అడుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని చెప్పుకొచ్చారు. వీరిద్దరికి మధ్యవర్తిగా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నట్లు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ఆరోపించారు.