Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Malkajgiri Lok Sabha constituency:మల్కాజ్ గిరిలో స్థానికున్ని మద్దతు నాకే ఇవ్వండి

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ బయటవారని నేనొక్కడినే స్థానికమైనందున ప్రజలందరూ నాకే మద్దతు పలకాలని టిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు.

మల్కాజ్ గిరి బిఆర్ఎస్ ఎంపి అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం(Malkajgiri Lok Sabha constituency)  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ బయటవారని నేనొక్కడినే స్థానికమైనందున ప్రజలందరూ నాకే మద్దతు పలకాలని టిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావే శంలో ఆయన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గౌడ్ తో కలసి మాట్లాడారు. మన కొంపల్లి మున్సిపాలిటీ పరిధిని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు సమస్య తెచ్చింద ని, నీళ్ల సమస్య వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మనం ఓటు వేసి గెలిపించుకున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లల్లో మల్కాజిగిరి నియోజకవర్గాన్ని(Malkajgiri Lok Sabha constituency )పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సునీతా మహేందర్ రెడ్డి తన తాండూరులో చూసుకోకుండా ఇక్కడేమి పని అని, అదే విధంగా ఈటేల రాజేందర్ హుజూరాబాద్ లో చూసుకోకుండా వీరిద్దరికీ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఏం పని అంటూ ప్రశ్నించారు.

మిత్రులా రా నేను మల్కాజిగిరి స్థానికుడు మీ అందరికీ అందుబాటులో ఉంటా, కష్టసుఖాలలో తోడుంటా అని స్పష్టం చేస్తూ హామీ ఇచ్చారు.మన కారు గుర్తుకు ఓటెయ్యండి నన్ను ఎంపీగా గెలిపించండి కుత్బుల్లా పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ రాముడు అయితే నేను లక్ష్మణుడు లాగా పని కలుపుకొని పనిచేస్తామని హామీ ఇచ్చారు.

దాదాపుగా 6000 కోట్ల రూపాయ లతో అభివృద్ధి చేసిన కుత్బుల్లా పూర్ నియోజక వర్గం,మల్కాజ్ గిరి ప్రజలారా ఆలోచించండి, ఆగం కాకండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మల్కాజ్ గిరి ని అభివృద్ధి చేసి చూపిస్తా మీ అందరికీ అందు బాటులో ఉంటానని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి చేసుకుందాం అని పునరుద్ఘాటిం చారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, ప్రభాకర్ రెడ్డి ప్రెసిడెంట్, మంజుల గౌడ్ కౌన్సిలర్ ,రవి యాదవ్, దేవేందర్,లక్ష్మణ్ గౌడ్, కిరణ్, సంజు, ప్రవీణ్, ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Malkajgiri people support ragidi laxma reddy