–గాంధీ,అంబేద్కర్ ల స్ఫూర్తి ఎమ్మార్పీఎస్ ను ముందుకు నడిపి స్తుంది
–దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ జరగాలి
— ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
Manda Krishna Madiga: ప్రజా దీవెన, హైదరాబాద్,: దేశంలో నెలకొని ఉన్న సామాజిక ,ఆర్థిక, రాజకీయ అంతరాలను(Social, economic and political gaps) నిర్మూ లించడం ద్వారా స్వాతంత్య్రాన్ని సంపూ ర్ణం చేసుకోవచ్చని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga)అన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొ న్న మంద కృష్ణ మాదిగ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” సుధీర్ఘ కాలంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అంతిమంగా విజయం సాధించిందని అన్నారు. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొని స్వాతంత్ర్యం సంపాదించుకోవడం వెనుక అనేక మంది వీరుల త్యాగాలు ఉన్నాయని అన్నారు. దేశ ప్రజలందరూ ఏకమై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ జరిగి ప్రజల సామాజిక జీవన స్థితిగతుల్లో మార్పులు రావాలని అన్నారు.
స్వాతంత్ర ఉద్యమ (Freedom movement) స్ఫూర్తితోనే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కొనసాగిందని అన్నారు.లక్ష్యాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్ళి లక్షలాది మందితో ప్రజా ఉద్యమాన్ని నడిపించడం వెనుక గాంధీ స్పూర్తి, సుధీర్ఘ కాల ఉద్యమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం వెనుక డా.అంబేద్కర్ స్పూర్తి MRPS కు ఉందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ధర్మం ఉంది కనుక విజయం సాధించదని, అలాగే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కూడా ధర్మం ఉంది కనుకనే విజయం సాధించిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి దేశంలో కొంత మంది దోపిడీదారులు చేసే అధర్మ ప్రయత్నాలు నిలువవు అని అన్నారు.కొంత మంది క్రిమిలేయర్ అనే అంశం అడ్డు పెట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు పికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
క్రిమిలేయార్ మీద సుప్రీం కోర్టు జడ్జీలు (Supreme Court Judges) వ్యక్తపరిచింది కేవలం అభిప్రాయమే తప్ప తీర్పు కాదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం క్రిమీలేయర్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఎక్కడ చెప్పలేదని అన్నారు.కనుక తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అతి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని అన్నారు. ఈ కార్య క్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర (MMRPS State)అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, మాదిగ మేధావులు డా. సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే పద్మాజ్యోతి , సుధాకర్ , ఇంకా MRPS మరియు అనుబంధ సంఘాల ప్రధాన నాయకులు పాల్గోన్నారు.